ప్రభాస్ ఫస్ట్ రెమ్యునరేషన్ మరీ అంత తక్కువా..? కల్కి కోసం ఎంత తీసుకున్నాడో తెలుసా...?

First Published Jun 28, 2024, 7:55 AM IST

కల్కి సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చాడు యంగ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియా హీరో ప్రభాస్. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈమూవీ పర్వాలేదు అనిపించింది. కాగా ఈ సందర్భంగా ఈసినిమాకు ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు..? అసలు ప్రభాస్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తక్కువో తెలుసా..? 

హిట్టు ప్లాప్ సంబంధం లేకుండా.. ఎప్పటికప్పుడు క్రేజ్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. యూనివర్సల్ హీరోగా ఎదుగుతున్నాడు. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో సందడి చేస్తున్న ప్రభాస్.. వరుసగా ఫెయిల్యూర్స్ ను కూడా చూస్తున్నాడు. బాహుబలి తరువాత ఆరేంజ్ లో ప్రభాస్ బ్లక్ బస్టర్ హిట్ ను అందుకున్నది లేదు. 
 

మూడు సినిమాలు ప్లాప్అయిన తరువాత సలార్ తో సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. ఇక తాజాగా కల్కి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే హిట్.. ప్లాప్ తో సంబంధం లేకుండా.. ప్రభాస్ ఇమేజ్ మాత్రం అంతకంతకూపెరుగుతూనే ఉంది. ఆయన రెమ్యూనరేషన్ కూడా భారీగా ఉంది. 600 కోట్ల బడ్జెట్ పెట్టిన కల్కి సినిమాకు ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత..? అసలు ఫస్ట్ మూవీకి ప్రభాస్ కు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారోతెలుసా..? 

వరుసగా ప్లాప్ లు పలకరించినా.. ఇమేజ్ ఏమాత్రం తగ్గనిస్టార్. ప్రస్తుతం వేలకోట్ల బడ్జెట్ సినిమాలు చేతిలో ఉన్న స్టార్ హీరో. ఇక  ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 5 సినిమాల వరకూ ఉన్నాయి. ఇండస్ట్రీలో వేలకోట్ల బిజినెస్ ప్రభాస్ సినిమాల నుంచి జరగనుంది. అంతే కాదు రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఇండియాలోనే హీరోలందరిలో టాప్ పోజిషన్ లో ఉన్నాడు ప్రభాస్. అందరికంటే ఎక్కువ వసూలు చేస్తున్నాడట కూడా..?. 
 

ఇక తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ADతో సినిమాతో ప్రభాస్ మరో భారీ హిట్ సాధించేశాడు. ఆదిపురుష్ డిజాస్టర్ తర్వాత సలార్ పార్ట్ 1, కల్కి మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్ లు కొట్టి  ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా చేశాడు ప్రభాస్. అంతే  కాదు గతంలో హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ చూసిన ప్రభాస్.. ఈసారి హ్యాట్రిక్ హిట్ టేస్ట్ ను అభిమానులకు చూపించాలని చూస్తున్నాడు. 

ఇక ప్రభాస్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. ఇండియాలోనే భారీగా వసూలు చేస్తున్న హీరోల లిస్ట్ లో ముందు ఉన్నాడు ప్రభాస్. ఆయన సలార్ పార్ట్ 1 కోసం దాదాపు  120 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటే.. కల్కి కోసం ఏకంగా 150 కోట్లకు పైగా వసూలు చేసినట్టు టాక్ నడుస్తోంది. ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న ప్రభాస్ తన ఫస్ట్ మూవీకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటాడో ఊహించగలరా..? 

2002 లో ఈశ్వర్ సినిమాతో తేరంగేట్రం చేశాడు ప్రభాస్.  శ్రీదేవి  హీరోయిన్ గా..  జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన  ఈశ్వర్, 2002 నవంబర్ 11న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఆ హైట్.. గ్లామర్ చూసి ఏమున్నాడ్రా బాబు అనుకున్నారు ఆడియన్స్.. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ కు 4 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ విషయాన్ని ప్రభాస్ ఓ ఇటర్వ్యూలో చెప్పారు. ఎక్కడ 4 లక్షలు.. ఎక్కడ 150 కోట్లు.. ఈ 22 ఏళ్ళల్లో ప్రభాస్ రేంజ్ ఏంత పెరిగిందో తలుచుకుని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. 

బాహుబలి వరకూ కూడా ఆయన 25 కోట్లు మత్రమే తీసుకున్నారు. పాన్ ఇండియా స్టేటస్ వచ్చిన తరువాతే 100 కోట్లు.. 120 కోట్లు. . 150 కోట్లకు పెరిగినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ మారుతీతో రాజాసాబ్, సందీప్ రెడ్డితోస్పిరిట్ , ప్రశాంత్ నీల్ తో సలార్ పార్ట్ 2  లైన్ లో ఉంచాడు. అటు హను రాఘవపూడి స్టోరీ కూడా ఒకే చేశాడు.. ఈ లెక్కడన ఈ సినిమాలన్నీ కలుపుకుంటే ఆయన రెమ్యూనరేషన్ 600 కోట్లకుపైనే అని చెప్పాలి. 

Latest Videos

click me!