2023లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరో ఎవరో తెలుసా? ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Published : Dec 29, 2023, 09:10 PM IST

2023లో సౌత్, నార్త్ లో బడా హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరించారు. అలాగే రెమ్యునరేషన్ లోనూ సత్తా చాటారు. కానీ ఈ ఏడాది అత్యధిక పారితోషికం అందుకున్న హీరో సౌత్ స్టార్ రికార్డు క్రియేట్ చేశారు.   

PREV
16
2023లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరో ఎవరో తెలుసా? ఎన్ని కోట్లో తెలిస్తే  నోరెళ్లబెట్టాల్సిందే!

ఈ ఏడాది ఉత్తరాదిలో మరియు దక్షిణాదిలో స్టార్ హీరోల సినిమాలు పెద్దఎత్తున సందడి చేశాయి. సంవత్సరం ప్రారంభంలోనే బ్లాక్ బాస్టర్ హిట్లను అందుకున్నారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. అలాగే మరిన్ని సినిమాలు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 

26

అటు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ Shah Rukh Khan వరుసగా రెండు వెయ్యికోట్ల  సినిమాలను రిలీజ్ చేశారు. సల్మాన్ కూడా ‘టైగర్3’తో దుమ్ములేపారు. తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  ఆదిపురుష్, రీసెంట్ గా ‘సలార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

36

అటు కోలీవుడ్ లోనూ స్టార్ హీరోలు థళపతి, ధనుష్ కూడా తమ సినిమాలతో అలరించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ Rajinikanth కూడా ‘జైలర్’ (Jailer) మూవీతో వచ్చారు. అయితే ఇంత మంది స్టార్స్ తమ సినిమాలతో అలరించారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్ములేపారు. 

46

ఈ క్రమంలో రెమ్యునరేషన్ లోనూ పోటీపడ్డారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల క్రేజ్ ఉండటంతో పారితోషికాల్లోనూ రేంజ్ మెయింటేయిన్ చేస్తున్నారు. వంద కోట్ల పైమాటే అంటున్నారు. ప్రస్తుతం వంద కోట్లు తీసుకుంటున్న హీరోలుగా ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఉన్నారు. 

56

ఇక ఈ ఏడాది మాత్రం అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా సూపర్ స్టార్ రజనీకాంత్ రికార్డు క్రియేట్ చేశారు. బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ Jailerకు ఏకంగా రూ.210 కోట్లు అందుకున్నారు. ఇండియాలో ఇంత రెమ్యునరేషన్ అందుకు మొదటి హీరో సూపర్ స్టార్ రజనీనే అంటున్నారు. 

66

2023లో రజనీకాంత్ రెమ్యునరేషన్ లో రికార్డు సెట్ చేశారు. ఆ తర్వాత ప్రభాస్ ‘సలార్’కు భారీగా ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే షారుఖ్ ఖాన్, సల్మాన్ కూడా తమ రీసెంట్ సినిమాలకు అత్యధిక పారితోషికం అందుకున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories