అయితే ఆ మూవీ షూటింగ్ సమయంలోనే అలియాభట్, రణ్ బీర్ కపూర్‌లు తాము జంటగా నటించిన `బ్రహ్మాస్త్ర` ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో ఎన్టీఆర్ వారిని ఇంటికి ఆహ్వానించారు. అప్పుడు గర్బంతోనే ఉంది అలియాభట్. వీరి మధ్య పుట్టబోయే చిన్నారికి సంబంధించిన చర్చ వచ్చిందట. తనకు పుట్టబోయే బిడ్డకి ఎలాంటి పేరు పెట్టాలో అనే డిస్కషన్ నడిచింది.
ఆ సమయంలోనే రణ్ బీర్ కపూర్, అలియా భట్ పేర్లు కలిసేలా `రహా` అనే పేరుని సూచించాడట ఎన్టీఆర్. తనకు పాప జన్మించడంతో ఎన్టీఆర్ చెప్పిన పేరే తన కూతురుకి పెట్టినట్టు తెలిపింది అలియాభట్. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. తన భర్త సూచించిన పేరు కంటే మరో హీరో చెప్పిన పేరునే తన కూతురుకి పెట్టడం విశేషం.
.