అయితే తన అల్లరి పనులకు ఎంత కోప్పడుతుందో, ఆ తర్వాత అంతే కూల్ అవుతుందని, దెబ్బలకు మందు రాస్తూ భోరున ఏడ్చేదట. తానంటే అమ్మకి ప్రాణం అని, తాను ఎక్కడ పక్కదారి పడతానేమో అనే భయంతో అలా చేసేదని చెప్పారు ఎన్టీఆర్.
తన విషయంలో ఎప్పుడూ గారాబం చేసేది కాదని, వాస్తవంలో ఎలా బతకాలో అమ్మనే నేర్పిందని, తనకు అమ్మే మొదటి గురువు అని తెలిపాడు ఎన్టీఆర్. `జీవితంలో ఏదో ఒకటి చెయ్, నిరూపించుకో, లేదంటే మనుగడ కష్టం` అని చెప్పేదట. అమ్మ తనకు అమ్మ మాత్రమే కాదని, తన బలం, బలగం అన్నీ తనే అని ఎమోషనల్ కామెంట్స్ చేశారు ఎన్టీఆర్.