Mahesh Babu : మహేశ్ బాబు ఎలాంటి పుస్తకాలు చదువుతారో తెలుసా? సూపర్ స్టార్ కు ఇష్టమైన బుక్స్ ఇవే!

First Published Feb 6, 2024, 1:52 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu వెండితెరపై అదరగొట్టడమే కాకుండా... వ్యక్తిగతంగానూ తన అభిమానులకూ స్ఫూర్తిగా నిలుస్తుంటారు. తాజాగా ఆయన పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. 

టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు రీసెంట్ గా ‘గుంటూరు కారం’ Guntur Kaaram చిత్రంతో అలరించారు. రీజినల్ ఫిల్మ్ తోనే కలెక్షన్ల పరంగా రికార్డు సెట్ చేశారు. ఇకపై బాబు పాన్ ఇండియా చిత్రాల్లో అలరించేందుకు సిద్ధమమయ్యారు. 

నెక్ట్స్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి SS Rajamouli దర్శకత్వంలో SSMB29లో నటించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ నుంచి అఫిషీయల్ అప్డేట్ కోసం అభిమానులు, నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 
 

Latest Videos


ఇదిలా ఉంటే మహేశ్ బాబు తన సినిమాలతో కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఇప్పటికే ఎంబీ ఫౌండేషన్ ద్వారా పిల్లలకు ఫ్రీగా హార్ట్ సర్జరీలు చేయిస్తున్నారు. పేదలకు అండగా నిలుస్తున్నారు. సొంత బ్యానర్ లోనూ యంగ్ టాలెంట్స్ తో సినిమాలు తీస్తున్నారు. 

ఇక మహేశ్ బాబు కోట్లాది అభిమానుల మనస్సులను గెలుచుకుంటున్నారు. ఇలా ప్రతి క్షణం ఇన్ స్పైరింగ్ కనిపిస్తున్న మహేశ్ బాబు సక్సెస్ సీక్రెట్ ఒకటి చెప్పారు. అదేంటో కాదు.. బాబు టైమ్ కేటాయించి మరీ పాపులర్ బుక్స్ చదువుతుంటారు. 

ఎంత ఎదిగినా నిత్య విద్యార్థిలా ఉంటున్నారు. ఇంతకీ మహేశ్ బాబు ఎలాంటి బుక్స్ చదువుతారో తెలిస్తే మీకూ బుక్స్ పై ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికే మహేశ్ బాబు... యువల్ నోహ్ హరారి రచించిన 'సేపియన్స్: ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్‌కైండ్', డేనియల్ గోలెమాన్ రచించిన 'ఎమోషనల్ ఇంటెలిజెన్స్', ఏతాన్ క్రాస్ రచించిన 'చాటర్: ది వాయిస్ ఇన్ అవర్ హెడ్ అండ్ హౌ టు హార్నెస్ ఇట్', జే శెట్టి రచించిన 'థింక్ లైక్ ఎ సన్యాసి' వంటి పుస్తకాలను రిఫెర్ చేశారు. 

తాజాగా మహేశ్ బాబు మరో పుస్తకాన్ని చదువుతున్నారు. రాబిన్ శర్మ రచించిన ‘ఎవ్రీడే హీరో మ్యానిఫెస్టో’ బుక్ ను చదువుతున్నట్టు అభిమానులతో చెప్పారు. ఈ సందర్భంగా రచయితకు థ్యాంక్స్ కూడా చెప్పారు. 
 

click me!