Rashmika Mandanna: రష్మిక పాత ప్రియుడి గురించి అడిగితే విజయ్ దేవరకొండ ఏం చేశాడో తెలుసా?

Published : Feb 25, 2026, 11:50 AM IST

Rashmika Mandanna: రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లికి సర్వం సిద్ధమైపోయింది. ఓ పాత వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అందులో రక్షిత్ శెట్టితో బ్రేకప్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్న రష్మికను అడిగితే విజయ్ దేవరకొండ మధ్యలో కల్పించుకున్నాడు.

PREV
14
రష్మిక - విజయ్ దేవరకొండ పెళ్లికి సిద్ధం

నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు అభిమానులు ఎక్కువ. తెలుగు, తమిళం, కన్నడలో కూడా క్రేజ్ ఎక్కువ. నిజం చెప్పాలంటే తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ దేవరకొండ కన్నా రష్మికకే అభిమానులు ఎక్కువనే టాక్ కూడా ఉంది.  వీరిద్దరి పెళ్లికి రాజస్థాన్‌లోని పెళ్లి మండపం పూర్తిగా  సిద్ధమైపోయింది. ఇప్పటికే  ఎంతో మంది సెలబ్రిటీలు అక్కడికి చేరుకుంటున్నారు. అంబానీ కుటుంబాన్ని కూడా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే రష్మిక మందన్న పేరు వింటేనే కన్నడ ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చేది తమ హీరో రక్షిత్ శెట్టి.  శాండల్‌వుడ్‌లో ఎంట్రీ కోసం రష్మిక… రక్షిత్‌ను వాడుకుందనే ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. 

24
నిశ్చితార్థం చేసుకుని మరీ

రక్షిత్, రష్మిక జూలై 2017లో పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్నారు. వారిద్దరూ కలిసి కిరిక్ పార్టీ సినిమాలో కలిసి నటించారు. కన్నడలో అదే రష్మిక మొదటి సినిమా. ఈ సినిమా సూపర్‌హిట్ కొట్టింది. ఆ సమయంలో వారిద్దరూ ప్రేమలో పడడం, ఎంగేజ్ మెంట్ చేసుకోవడం జరిగిపోయింది. కానీ ఆ బంధం ఎంతో కాలం నిలవలేదు. 

34
అవకాశాల పేరు చెప్పి

కిరిక్ పార్టీ సినిమా హిట్ అవ్వడంతో పాటూ తెలుగులో వచ్చిన ఛలో కూడా సూపర్ హిట్ కొట్టింది. దీంతో రష్మికకు అవకాశాలు వెల్లువలా రావడం మొదలయ్యాయి. దీంతో రష్మిక పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకుంది. కెరీర కోసం ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. ఈ బ్రేకప్ వల్ల రక్షిత్ శెట్టి చాలా బాధపడ్డాడని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత రష్మిక - రక్షిత్‌ పూర్తిగా విడిపోయారు. ఆ తరువాత విజయ్ దేవరకొండతో గీత గోవిందం సినిమా చేసింది. ఇక ఆ సినిమాతో తెలుగులో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. అలాగే విజయ్ దేవరకొండతో ప్రేమలో కూడా పడినట్టు తెలుస్తోంది.

44
రష్మికను కాపాడిన విజయ్ దేవరకొండ

గతంలో ఓసారి విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి సినిమా ప్రమోషన్ కోసం కర్ణాటక వెళ్లారు. అక్కడ ప్రెస్‌మీట్‌లో రష్మికను కన్నడ భాషలోనే రక్షిత్ శెట్టితో బ్రేకప్ గురించి అడిగారు ఒక విలేకరి. 'మీరు, రక్షిత్ శెట్టి కలిసి కనిపించడం లేదు. ఏంటి సంగతి? మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది?' అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న రష్మికకు అర్థమైనా కూడా అర్థం కానట్టు నటించింది. రష్మిక ఇబ్బంది పడడంతో విజయ్ దేవరకొండ కల్పించుకున్నాడు. 

రష్మిక సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా 'మీరు ఏం అడుగుతున్నారో మాకు అర్థం కావడం లేదు. కానీ ఏది పడితే అది అడగటం మంచిది కాదు' అని సీరియస్‌గా చెప్పాడు. ఆ తర్వాత రష్మిక, 'మీరు అడిగిన ప్రశ్న చాలా పెద్దగా ఉంది. నాకేమీ అర్థం కాలేదు' అని నవ్వేసింది. కానీ రక్షిత్ శెట్టి గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు.  ఈ వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories