జూ ఎన్టీఆర్ అమ్మకి రామారావు చెప్పిన మాట.. తాతపై తారక్‌కి కోపం
`ఇంతకాలం దూరంగా ఉన్నాము, దాని గురించి మర్చిపోండి. నా వంశోద్ధారకుడు నీ కడుపు పుట్టాడు. నా అంతటి వాడిగా తీర్చిదిద్దడంలో నీ వంతు బాధ్యతను నువ్వు నిర్వర్తించమ్మ, నా వంతు బాధ్యతను నేను నిర్వర్తిస్తాను` అని అన్నాడని, అన్న కొన్ని రోజులకే తాత చనిపోయాడని చెప్పాడు తారక్. అప్పుడు తనకు చాలా కోపం వచ్చిందని, అప్పుడే తనకు ధైర్యం వచ్చింది. ఉత్సాహం వచ్చింది, ఇక తనకు తిరుగులేదని భావించాను. అంతలోనే చనిపోవడంతో తాతపై చాలా కోపం వచ్చిందని తెలిపారు తారక్. నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్పాడు, అంతలోనే అనాథగా వదిలేసి వెళ్లిపోయాడంతో కోపం తట్టుకోలేకపోయానని తెలిపారు. కానీ పెద్దయ్యాక ఇప్పుడు అర్థమవుతుంది, నాకు కావాల్సిన మూడు అక్షరాలు `ఎన్టీఆర్` ఇచ్చాడు, అది చాలు నాకు అనిపించిందని చెప్పాడు తారక్. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో జూ ఎన్టీఆర్ ఈ విషయాన్ని పంచుకున్నారు.