Bhagyashri Borse: చిన్నప్పుడు తండ్రి పడ్డ కష్టాలు పంచుకుంటూ భాగ్యశ్రీ బోర్సే ఎమోషనల్.. అప్పుడే డిసైడ్‌

Published : Jul 14, 2026, 01:44 PM IST

లేటెస్ట్ సెన్సేషన్‌ భాగ్యశ్రీ బోర్సే `లెనిన్‌`తో హిట్‌ అందుకుంది. తనకు తొలి హిట్‌ పడిన నేపథ్యంలో చిన్నప్పుడు రోజులను గుర్తు చేసుకుంది. తాము పడ్డ కష్టాలు పంచుకుంటూ ఎమోషనల్‌ అయ్యింది.

PREV
15
ఐదు సినిమాలు చేసినా హిట్‌ లేదు

భాగ్యశ్రీ బోర్సే కి ఎట్టకేలకు హిట్ పడింది. ఆమెకి తొలి విజయం రావడానికి మూడేళ్లు పట్టింది, ఏడు సినిమాలు చేయాల్సి వచ్చింది. 2023లో కెరీర్ ని ప్రారంభించింది. రెండు హిందీ చిత్రాల్లో చిన్న పాత్రల్లో మెరిసింది. పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో తెలుగులోకి ఆమె `మిస్టర్‌ బచ్చన్` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. రవితేజ హీరోగా నటించిన చిత్రమిది. హరీష్‌ శంకర్‌ దర్శకుడు. ఈ మూవీతో పాపులర్‌ అయ్యింది భాగ్యశ్రీ. హిట్‌ రాకపోయినా అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

25
వరుసగా డిజప్పాయింట్‌

ఆ తర్వాత విజయ్‌ దేవరకొండతో `కింగ్డమ్‌` మూవీలో మెరిసింది. ఇందులో కాసేపే కనిపించినా ఆకట్టుకుంది. ఆ తర్వాత రామ్‌తో కలిసి `ఆంధ్రా కింగ్‌ తాలూకా` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఆమెకి మంచి పాత్రనే పడింది. కానీ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో మరోసారి ఆమెకి నిరాశనే ఎదురైంది. ఇక దుల్కర్‌ సల్మాన్‌ తో `కాంత` మూవీలో మెరిసింది. సినిమా బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చిన మూవీ ఇది. ఇందులో హీరోయిన్‌గా ఆమె అద్భుతమైన నటనతో మెప్పించింది. అవార్డు పర్ఫెర్మెన్స్ అని అంతా ప్రశంసలు కురిపించారు. కానీ హిట్‌ రాలేదు. ఇలా బ్యాక్‌ టూ బ్యాక్‌ డిజప్పాయింట్‌ ఎదురవుతూనే ఉంది.

35
లెనిన్‌తో తొలి హిట్‌ అందుకున్న భాగ్యశ్రీ బోర్సే

ఈ క్రమంలో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఒక్క హిట్‌ రావాలని కోరుకుందట. ఎట్టకేలకు హిట్‌ పడింది. `లెనిన్‌` మూవీ బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. అంతేకాదు వసూళ్ల పరంగానూ సత్తా చాటుతోంది. ఈ మూవీ నాలుగు రోజుల్లోనే రూ.67కోట్లు రాబట్టింది.  లాంగ్‌ రన్‌లో వంద కోట్ల వరకు వెళ్తుందా అనేది చూడాలి. ఇక తనకు తొలి హిట్‌ పడటంతో భాగ్యశ్రీ బోర్సే ఎమోషనల్‌ అయ్యింది. మొన్న `లెనిన్‌` సక్సెస్‌ మీట్‌లోనూ భావోద్వేగానికి గురయ్యింది. ఇప్పుడు మరోసారి తన భావని  వెళ్లడించింది. ఈ క్రమంలో తన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంది.

45
చిన్నప్పుడు తండి పడ్డ బాధలు పంచుకుంటూ భాగ్యశ్రీ ఎమోషనల్‌

చిన్నప్పుడు తన తండ్రి జాబ్‌ కోసం పడ్డ ఇబ్బందులు పంచుకుంది భాగ్యశ్రీ బోర్సే. తాను పుట్టిన కొన్ని రోజులకే తన తండ్రికి జాబ్‌ పోయిందట. దీంతో ఫ్యామిలీని పోషించడానికి ఇబ్బంది అయ్యిందట. ఆ సమయంలో తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు, దయజేసి ఎవరైనా జాబ్‌ ఇవ్వాలని కోరుకున్నారట. తమది దిగువ మధ్యతరగతి కుటుంబమని, చిన్నప్పటి నుంచి తమ పేరెంట్స్ పడ్డ కష్టాన్ని స్వయంగా చూసినట్టు తెలిపింది భాగ్యశ్రీ. ఇంట్లో ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాల్సి వచ్చిందట. రూ.10 పచ్చిమిర్చి, రూ.10 పాలకూర కొన్నా కూడా దాన్ని బుక్‌లో నోట్‌ చేసుకునేదట. ఒక వారం రూ.300 ఖర్చయితే తర్వాతి వారం ఎలా గడపాలా అని తల్లిదండ్రులు ఆలోచించేవారని గుర్తు చేసుకుంది. చిన్నతనంలో డబ్బు విలువ తెలియకపోయినా, పెరిగేకొద్దీ తల్లిదండ్రుల కష్టాలు అర్థమయ్యాయని వివరించింది.

55
తండ్రిని అలా చూసి భాగ్యశ్రీ బోల్డ్ డెసీషన్‌

ఈ క్రమంలోనే భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ, `నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దయచేసి నాకు ఉద్యోగం ఇవ్వండి` అంటూ తన తండ్రి ఒకరి వద్ద వేడుకున్నారని తెలిపింది. చిన్న వయసులో తండ్రిని ఆ పరిస్థితుల్లో చూసి చాలా బాధకలిగిందని, అప్పుడే ఆయన మళ్లీ ఎప్పుడూ అలాంటి పరిస్థితిని ఎదుర్కోకూడదని నిర్ణయించుకున్నానని, లైఫ్‌లో తాను సాధించాలనుకున్న ప్రతి లక్ష్యం వెనుక తల్లిదండ్రులే ప్రేరణగా ఉన్నారని వెల్లడించింది. ఓ యూబ్యూట్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను బయటపెట్టారు. ఆమె కామెంట్ వైరల్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories