ఇక `శాకుంతలం` చిత్రంలోని శకుంతల, దుష్యంతుడు ధరించిన బంగారు, వజ్రాల అభరణాలు, దుస్తులను వసుంధర జ్యూవెల్లరి వారే తయారు చేసినట్టు చెప్పారు గుణశేఖర్. వసుంధర, ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా, నేహ వంటి వారు ఈ డిజైన్స్ చేశారని తెలిపారు. శకుంతల పాత్రకి 15కేజీల బంగారంతో 14 రకాల ఆభరణాలు చేశారట, అలాగే దుష్యంతుడి పాత్ర కోసం దాదాపు పది కేజీల బంగారు ఆభరణాలు, మేనక పాత్ర ధారి అయిన మధుబాల కోసం ఆరు కోట్లతో వజ్రాలు పొదిగిన దుస్తులను, బంగారు ఆభరణాలను తయారు చేయించామని వెల్లడించారు. ఇవన్నీ చేతితో చేసిన ఆభరణాలని, వీటిని ధరించడం వల్ల ఆయా పాత్రలకు అందం వచ్చిందని, అంతిమంగా అది సినిమాకి అందాన్ని తీసుకొచ్చిందన్నారు. శాకుంతలం సినిమాని ప్రకటించగా, అదే అన్నింటిని సమకూర్చుకుందని, అంతా కలిసి వచ్చారని మా వర్క్ ఈజీ అయ్యిందని చెప్పారు.