స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అనసూయ గ్లామర్ మెరుపులు.. చీరకట్టులో స్టార్ యాంకర్ కిర్రాక్ పోజులు.. మతులు పోవాల్సిందే..

First Published | Mar 23, 2023, 2:09 PM IST

గ్లామర్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) లేటెస్ట్ ఫొటోషూట్ లో కట్టిపడేస్తోంది. చీరకట్టులో గ్లామర్ మెరుపులు మెరిపించింది. ఒక్కో స్టిల్ తో కుర్ర గుండెల్ని పేల్చేసింది. 
 

స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనేచెప్పాలి. యాంకర్ గా కేరీర్ ప్రారంభించిన అనసూయ ప్రస్తుతం స్టార్ నటిగా వెండితెరపై ప్రేక్షఖులను అలరిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆకట్టుకుంటోంది. 
 

తాజాగా  అనసూయ ‘రంగమార్తాండ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉగాది సందర్భంగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హ్యూమన్ ఎమోషన్స్ తో సరికొత్తగా తెరకెక్కిన నఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంది.
 


ఈ చిత్రంలో అనసూయ కూడా కీలక పాత్ర పోషించారు. సినిమా ప్రమోషన్స్ లోనూ చాలా చురుకుగా పాల్గొన్నారు. తనకు ఇలాంటి సినిమాలో అవకాశం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేసంది. మరోవైపు ఎమోషనల్ అవుతూ స్టేజీపైనే ఏడ్చేసింది. 

అలాగే ప్రచార కార్యక్రమాల కోసం అదిరిపోయేలా ఫొటోషూట్లు కూడా చేసింది. తాజాగా ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. చీరకట్టులో మతిపోయేలా ఫోజులిస్తూ ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేసింది. లేటెస్ట్ పిక్స్ లో చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది.
 

అనసూయ తన బ్యూటీతో ఇప్పటికే యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నవిషయం తెలిసిందే. లేటెస్ట్ పంచుకున్న ఫొటోస్ లో మరింత బ్యూటీఫుల్ గా కనువిందు చేసింది. అలాగే స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. షోల్డర్ అందాలతో మతులు పోగొట్టింది. 
 

స్టార్ బ్యూటీ అనసూయ చీరకట్టు అందాలకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా లైక్స్, కామెంట్లతో ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక అనసూయ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప : ది రూల్’లో నటిస్తోంది. 
 

Latest Videos

click me!