ప్రభాస్ ఇండియన్ సినిమాని శాషిస్తున్నాడు. ఆయన `కల్కి 2898 ఏడీ`తో మరో సారి తానేంటో నిరూపించుకున్నాడు. ఈ మూవీ వెయ్యి కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇలా బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నాడు డార్లింగ్. భారతీయ సినిమాలోనే తిరుగులేని స్టార్ గా రాణిస్తున్నారు.
అయితే కెరీర్ బిగినింగ్‌లో తాను చేయాల్సిన ఓ మూవీ, మరో హీరో వద్దకు వెళ్లింది. ఆయన హిట్ కొట్టాడు. ఆ సినిమాతోనే ఇండస్ట్రీలో నిలబడ్డాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రభాస్ వదులుకున్న సినిమాతో సక్సెస్ అందుకుని ఇప్పుడు తగ్గేదెలే అంటున్నారు. మరి ఆ హీరో ఎవరో తెలుసా?
Allu Arjun
ఆయన ఎవరో కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన తొలి సినిమా `గంగోత్రి`. ఇది బన్నీని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. కానీ హిట్ గా చెప్పేంత కాదు. ఈ విషయంలో బన్నీ కూడా నిరాశతోనే ఉన్నాడు. సాలిడ్‌గా మరో సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నారు. చాలా కథలు విన్నాడు ఏది నచ్చడం లేదు. ఇంకా ఏదో కావాలనే ఫీలింగ్ ఉంది. క్రేజీగా ఉండే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.
ఆ టైమ్‌లోన ప్రసాద్ ల్యాబ్‌లో సుకుమార్ కలిశారట. `ఆర్య` కథ చెప్పాడు. అది విని పిచ్చెక్కిపోయింది. ఎలాగైనా ఆ మూవీ చేయాలని ఫిక్స్అయ్యాడు బన్నీ. అందుకోసం అల్లు అరవింద్‌ని ఒప్పించాడు. వినాయక్ ధైర్యమిచ్చాడు. చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మొత్తంగా చాలా రోజులు చర్చల అనంతరం `ఆర్య` పట్టాలెక్కింది. సంచలన విజయం సాధించింది. అప్పట్లో ఇదొక క్రేజీ ఫిల్మ్ గా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. లవ్ స్టోరీలో ఇదొక డిఫరెంట్ మూవీగా నిలిచింది. ఈ మూవీతోనే బన్నీకి స్టార్ ఇమేజ్ వచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ సినిమా మొదట ప్రభాస్‌కే చెప్పాడు సుకుమార్. కానీ ఆయన తనకు ఇది సెట్ కాదని అన్నాడట. దీంతో బన్నీ వరకు వెళ్లింది.
ఈ మూవీ తర్వాత బన్నీ వరుసగా `బన్నీ`, `దేశముదురు`, `రేసుగుర్రం`, `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `డీజే`, `సరైనోడు1, `అలా వైకుంఠపురములో` వంటి సినిమాతో విజయాలు అందుకుని సూపర్ స్టార్ అయ్యాడు. `పుష్ప`తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీ.. `పుష్ప2`తో మరోసారి ఇండియాని షేక్ చేసేందుకు వస్తున్నాడు. ఈ సారి పాన్ వరల్డ్ మార్కెట్‌ని టార్గెట్ చేయబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కాబోతుంది.