`యానిమల్‌`లో రష్మిక బోల్డ్ సీన్లు వైరల్‌.. హిందీలో అయితే అన్నింటికీ తెగిస్తారా? అసూయ వెళ్లగక్కుతున్న ట్రోలర్స్

Published : Dec 02, 2023, 03:51 PM IST

రష్మిక మందన్నా సైతం ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. ఆమె కొన్ని సీన్లలో కనిపించిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. గతంలో అంతకు ముందే ఏ సినిమాలోనూ ఇంత బోల్డ్ గా కనిపించలేదు రష్మిక.

PREV
17
`యానిమల్‌`లో రష్మిక బోల్డ్ సీన్లు వైరల్‌.. హిందీలో అయితే అన్నింటికీ తెగిస్తారా? అసూయ వెళ్లగక్కుతున్న ట్రోలర్స్

రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన `యానిమల్‌` మూవీ శుక్రవారం విడుదలైంది. బోల్డ్ కంటెంట్‌, హీరో వాడే లాంగ్వేజ్‌, కొన్ని సీన్ల విషయంలో అభ్యంతరం ఎదురవుతుంది. కానీ సినిమా మాత్రం క్రేజీగా ఉందని అంటున్నారు. సినిమా బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. ఈ మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 110కోట్ల గ్రాస్‌ సాధించింది. `జవాన్‌`, `పఠాన్‌` రేంజ్‌ కలెక్షన్లుగా చెప్పొచ్చు. ఇదే ఊపు ఉంటే సినిమా వెయ్యి కోట్లు దాటడం ఈజీనే. 

27

అయితే ఈ సినిమాలో ప్రధానంగా బోల్డ్ కంటెంట్‌ గురించి చర్చ జరుగుతుంది. దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా సెక్స్ గురించి, లేడీస్‌, ముఖ్యంగా మేల్‌కి సంబంధించిన ప్రైవేట్‌ పార్ట్ పై, ఫీలింగ్స్ పై డైలాగులు, ఆయా సీన్లు శృతి మించినట్టుగా ఉన్నాయనే పెదవి విరుపు వినిపిస్తుంది. కానీ ఆయా సీన్లలోనే కామెడీ ఉండటంతో చాలా వరకు ఎంజాయ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా యూత్‌, మాస్‌ ఆడియెన్స్ దీన్ని ఎంజాయ్‌ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 
 

37

ఇదిలా ఉంటే రష్మిక మందన్నా సైతం ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. ఆమె కొన్ని సీన్లలో కనిపించిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. గతంలో అంతకు ముందే ఏ సినిమాలోనూ ఇంత బోల్డ్ గా కనిపించలేదు రష్మిక. ఇందులో బెడ్‌ సీన్లు చేసింది. లిప్‌ లాక్‌ సీన్లకి కొదవే లేదు. ఇంట్లో పేరెంట్స్ ముందు, ఆ తర్వాత ఫ్లైట్‌లో అయితే కొదవే లేదు. ఆ సమయంలో వచ్చే పాటలో ఓ రకంగా తెగింపుకి సిద్ధమైందని అంటున్నారు ట్రోలర్స్.

47

మరోవైపు రణ్‌ బీర్‌ కపూర్‌ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఆమె ఏకంగా డ్రెస్‌ విప్పి బ్రాలో కనిపించడం షాకిచ్చింది. రష్మిక గతంలో ఎలా ఉంది, ఇందులో ఎలా చేసిందని ముక్కున వేలేసుకుంటున్నారు. మరోవైపు రణ్‌ బీర్‌ కపూర్‌ ఆమెని బ్రా లాగి కొట్టడంతో వీపు భాగం కమిలిపోతుంది. దీంతో అప్పుడు బెడ్‌పై బ్యాక్‌ చూపించిన తీరు, ఆ సీన్లు సైతం టూ మచ్‌గా, బోల్డ్ గా అనిపించాయి. 

57

ఇక ఛాన్స్ దొరికితే లిప్‌ లాక్‌ సీన్లతో రెచ్చిపోవడం కుర్రాళ్లకి కిక్‌ ఇచ్చినా, ఫ్యామిలీ ఆడియెన్స్ ని మాత్రం బాగా ఇబ్బంది పెడుతుంది. మరోవైపు సెక్స్ కి సంబంధించిన చర్చ ఓపెన్‌గా చేసుకోవడం, ఇక్కడనా, అక్కడనా.. ఇలా మరీ ఓపెన్‌గా మాట్లాడుకునే సీన్లు సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇదే సినిమాకి హైలైట్‌గా నిలుస్తున్నాయి. అయితే ఇలాంటి సీన్లలో రష్మిక కనిపించడమే ఇక్కడ షాకిచ్చే అంశం. 
 

67

దీంతో దీనిపై ట్రోలర్స్ అసూయ చెందుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. సౌత్‌లో ఇలా పద్ధతిగా కనిపిస్తారు. కానీ నార్త్ కి వెళితే మారిపోతారని, అక్కడ ఏమైనా చేయడానికి సిద్ధమవుతారని అంటున్నారు. హిందీలోకి వెళితే ఎలాంటి హద్దులు కనిపించవని, ఎంతకైనా తెగిస్తారని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రచ్చ చేస్తున్నారు. రష్మిక ఇలా చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆమె ఇంటిమేట్‌ సీన్లకి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. 
 

77

అయితే సందీప్‌ రెడ్డి వంగా సినిమా అంటే బ్రేక్‌ ఆల్‌ బౌండరీస్‌. ఆ సినిమాలో చేస్తున్నారంటే అన్నింటికి సిద్ధమవ్వాల్సిందే. వారికొచ్చే పేరుకూడా అలానే ఉంటుంది. ఇప్పుడు `యానిమల్‌` సినిమాకి కూడా అదే వర్తిస్తుంది. అలానే చేశాడు. మేజర్‌ ఆడియెన్స్ దాన్నే ఇష్టపడుతున్నారు. పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో అంతటి ఇంటెన్స్ లవ్‌లో, ఇలాంటి ఇంటిమేట్‌ సీన్లు కామనే అని, బోల్డ్ సీన్లు, బోల్డ్ డైలాగులు కామనే అని నచ్చిన వారి నుంచి వినిపించే మాట. అందుకు వస్తోన్న కలెక్షన్లే నిదర్శనంగా చెప్పొచ్చు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories