Rashmika Mandanna : రష్మిక మందన్న మొదటి సినిమాకు ఎలా ఎంపికైందో తెలుసా? అప్పుడే అంత సీన్ జరిగిందా!

First Published | Apr 5, 2024, 5:25 PM IST

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna)   మొట్టమొదటి సినిమాకు ఎలా ఎంపికైందో తెలిస్తే అందరూ ఆశ్చర్య పోతారు. ఇంతకీ ఎలా ఆ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో ఎంతటి క్రేజ్ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ‘పుష్ప’, ‘యానిమల్’  చిత్రాల తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది.

రష్మిక మందన్నకు ప్రస్తుతం ఆల్ ఓవర్ ఇండియా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మకు  ఫాలోయింగ్ పెరగడంతో పాటు ఇండస్ట్రీలోనూ మరింత గుర్తింపు దక్కుతోంది. 



రీసెంట్ గానే ‘యానిమల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెక్ట్స్ ఆమె ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ లో ‘పుష్ప2’ (Pushpa2) రిలీజ్ కావాల్సి ఉండటం విశేషం. ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది.

ఇదిలా ఉంటే.. ఈరోజు రష్మిక మందన్న పుట్టిన రోజు ఈవ్వాళే కావడం విశేషం. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి. 

రష్మిక మందన్న ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆమె మొదటి సినిమాకు ఎలా ఛాన్స్ దక్కించుకుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

మొదటగా రష్మిక ‘కిర్రాక్ పార్టీ’ చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమాకు తను కాలేజీ డేస్ లో అవకాశం అందుకోవడం విశేషం. ‘ఫ్రెష్ ఫేస్ 2014’ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఈ సినిమాకు ఛాన్స్ దక్కించుకుంది. రష్మిత్ శెట్టి సరసన నటించి హిట్ అందుకుంది. ఆ సినిమాతో తన లైఫ్, కెరీర్ మొత్తం మారిపోయింది.

Latest Videos

click me!