రష్మిక మందన్నా చేస్తున్న సినిమాలు ఇవే.. బర్త్ డే సందర్భంగా వాటిపై క్లారిటీ.. అన్నింటిలో కామన్‌ పాయింట్ అదే!

Published : Apr 05, 2024, 04:56 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఏ సినిమా చేసినా అందులో ఏదో స్పెషాలిటీ ఉంటుంది. ఆడియెన్స్ ని అలరించడంలో ఆమె ప్రత్యేకత చూపిస్తుంది. తాజాగా బర్త్ డే సందర్భంగా రష్మిక నటిస్తున్న సినిమాలపై క్లారిటీ వచ్చింది.   

PREV
17
రష్మిక మందన్నా చేస్తున్న సినిమాలు ఇవే.. బర్త్ డే సందర్భంగా వాటిపై క్లారిటీ.. అన్నింటిలో కామన్‌ పాయింట్ అదే!

 కన్నడలో ప్రారంభమైన రష్మిక మందన్నా కెరీర్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌ వరకు వెళ్లింది. `పుష్ప`, `యానిమల్‌` చిత్రాలతో రష్మిక రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్‌ బ్యూటీస్‌ని మించిపోతుందని చెప్పొచ్చు. ఎంత ఎదిగిన ఒదిగే ఉంటుంది. సింపుల్‌గానే ఉంటుంది. చలాకీతనం, అల్లరితనం, టాలెంట్‌ కలబోతగా ఉంటుంది రష్మిక. అదే ఆమె సక్సెస్‌కి కారణమవుతుందని చెప్పొచ్చు. 

27

రష్మిక మందన్నా నేడు (ఏప్రిల్‌ 5) పుట్టిన రోజుని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాలపై క్లారిటీ వచ్చింది. రష్మిక మందన్నా ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తుందనేది ఓ సందేహం ఉండేది. ఆమె ఒప్పుకున్న సినిమాలు ఆగిపోయినట్టు ప్రచారం జరిగింది. కానీ తాజాగా దానిపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా ఉండనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. 
 

37

అయితే నేషనల్‌ క్రష్‌ చివరగా `యానిమల్‌` చిత్రంలో మెరిసింది. ఇప్పుడు `పుష్ప2`తో రాబోతుంది. అల్లు అర్జున్‌ హీరోగా, సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ మూవీలో ఆమె శ్రీవల్లి పాత్రలో కనిపిస్తుంది. తాజాగా పుష్ప2` నుంచి ఆమె పాత్ర లుక్‌ని విడుదల చేశారు. ఇందులో రష్మిక ఎలా కనిపించబోతున్నారో వెల్లడించారు. ఇందులో పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుని కనిపిస్తుంది రష్మిక మందన్నా. జాతరలో లుక్‌ లాగా ఉంది. అయితే ఒక కంటిలో నుంచి చూస్తున్నట్టుగా ఉన్న లుక్‌ అదిరిపోయింది. చూస్తుంటే ఆమె పాత్రలోనూ మరో షేడ్‌ కనిపిస్తుంది. అదేంటనేది ఆసక్తికరం. ఇందులోనూ రష్మికది చాలా ఇంపాక్ట్ చూపించే పాత్ర కావడం విశేషం. 
 

47

ఆమె నటిస్తున్న మరో సినిమా `ది గర్ల్ ఫ్రెండ్‌` అనే చిత్రంలో నటిస్తుంది. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. ఈ మూవీ నుంచి రష్మికకి విషెస్‌ చెబుతూ లుక్‌ని విడుదల చేశారు. ఆమె ముందు ఆమె కళ్లు నవ్వుతాయి, ఆమె చేయని మాటలు మాట్లాడతాయి అనే క్యాప్షన్‌తో రష్మిక ఫస్ట్ లుక్‌ని పంచుకున్నారు. ఇందులో స్టూడెంట్‌గా కనిపిస్తుంది. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడం విశేషం. 
 

57

దీంతోపాటు `రెయిన్బో` అనే మరో సినిమా చేస్తుంది రష్మిక మందన్నా. సమంత చేయాల్సిన ఈ చిత్రాన్ని రష్మిక చేస్తుంది. ఈసినిమాని చాలా రోజుల క్రితమే స్టార్ట్ చేశారు. కానీ ఆ తర్వాత అప్‌ డేట్‌ లేదు. మహిళా ప్రధానంగా సాగే సినిమా ఇది. అయితే ఈ మూవీ ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు టీమ్‌ రష్మికకి బర్త్ డే విషెస్‌ తెలియజేస్తూ ఓ ఫోటోని షేర్‌ చేశారు. డ్రీమ్స్ వారియర్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి తమిళ టీమ్‌ ఎక్కువగా పనిచేస్తుంది. ఇందులో ఆమె పాత్ర చుట్టూనే కథ తిరుగుతుందని చెప్పొచ్చు. 
 

67

మరోవైపు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో `కుబేర` సినిమా చేస్తున్నారు. ధనుష్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌. ధనుష్‌కి జోడీగా ఆమె కనిపిస్తుంది. బర్త్ డే సందర్భంగా రష్మికకి విషెస్‌ చెప్పింది టీమ్‌. రెగ్యూలర్‌ ఫోటోని పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. `కుబేర`లో ఆమె పాత్ర కూడా బలంగానే ఉంటుందని తెలుస్తుంది. 
 

77

ఇలా ప్రస్తుతం అఫీషియల్‌గా.. `పుష్ప 2`, `ది గర్ల్ ఫ్రెండ్`, `కుబేర`తోపాటు `రెయిన్‌బో` చిత్రాలు చేస్తుంది. నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. ఇందులో రెండు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు కావడం విశేషం. ఆమె నటిస్తున్న ప్రతి సినిమాలోనూ రష్మిక మందన్నా పాత్రకి చాలా ప్రయారిటీ ఉంటుందట. అదే ఆమె ప్రత్యేకత. బలంగా లేని పాత్రలు, సినిమాలు ఆమె ఒప్పుకోవడం లేదని టాక్‌. మొత్తగా తన బర్త్ డే సందర్భంగా తాను నటిస్తున్న సినిమాల లుక్‌లతో ఫ్యాన్స్ ని అలరిస్తుంది నేషనల్‌ క్రష్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories