ఆర్జీవీ - చిరంజీవి సినిమాతో పాటు.. మెగాస్టార్ కెరీర్ లో ఎన్ని సినిమాలు ఆగిపోయాయో తెలుసా?

First Published Mar 27, 2024, 10:38 AM IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇప్పటికీ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. అయితే మెగాస్టార్ కెరీర్ లో ఈ సినిమాలు ఆగిపోయాయని చాలా మందికి తెలిసి ఉండదు. అవేంటో, ఎందుకు విడుదల కాలేదో చూద్దాం...

పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన పేరు టాలీవుడ్ చరిత్రలో స్వర్ణక్షరాలతో లిఖించిబడుతందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో సినిమాలు నటించడంతో పాటు సినీ పెద్దగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

ఇప్పటి వరకు మెగాస్టార్ ఆయన కెరీర్ లో 164 సినిమాల్లో నటించి మెప్పించారు. ఆ మధ్యలో ‘ప్రజారాజ్యం’ పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా.. మళ్లీ సినీ రంగంలోకే రీఎంట్రీ ఇచ్చారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు.

అయితే ఇండస్ట్రీలో ఇప్పటికీ కొన్ని సినిమాలు ప్రారంభమై ఎప్పుటికి రిలీజ్ అవుతాయ్ తెలియడం లేదు. మరిన్ని కొన్నైతే మూలకు పడ్డ విషయం కూడా తెలిసిందే. ఇలాగే మెగాస్టార్ కెరీర్ లోనూ జరిగింది. 
 

చిరంజీవి కెరీర్ లోనూ మూడు సినిమాలు ఆగిపోయాయి. షూటింగ్ ప్రారంభించుకొని మధ్యలోనే షెడ్ కు వెళ్లాయి. ఆ సినిమాలేంటనేది చాలా మందికి తెలిసి ఉండదు. ఇంతకీ వాటి గురించి చూద్దాం.
 

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ - చిరంజీవి కాంబోలోని రావాల్సిన ‘భూలోక వీరుడు’, సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలోని ‘వినాలని ఉంది’, దర్శకుడు సురేష్ కృష్ణతో ‘బాగ్దాద్ గజదొంగ’ అనే సినిమాలు ఓకే అయ్యాయి.. షూటింగ్ జరుపుకొని మధ్యలోనే ఆగిపోయాయి. 

ఆ మూడు మినహా మిగిలిన చిత్రాలన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రిజల్ట్స్ ను అందుకున్నాయి. ఇక ప్రస్తుతం మెగాస్టార్ ‘విశ్వంభర’ (Vishwambhara)  చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బింబిసార’ వశిష్టం దర్శకత్వం వహిస్తున్నారు.

click me!