తండ్రి ఏఎన్నార్ కి ఝలక్ ఇచ్చిన నాగార్జున, విదేశాల్లో చదివిస్తే అలా చేశాడట!

First Published Oct 18, 2024, 5:13 PM IST

కింగ్ నాగార్జున హీరో అవుతాడని అనుకోలేదట ఏఎన్నార్. విదేశాల్లో చదివించింది ఎందుకో ఓ సందర్భంలో ఏఎన్నార్ వెల్లడించారు. 
 

ANR

అక్కినేని నాగేశ్వరరావు లెజెండరీ నటుడు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు సినిమాకు రెండు కళ్ళు అంటారు. సుదీర్ఘ కెరీర్లో ఏఎన్నార్ అరుదైన విజయాలు నమోదు చేశారు. ఏఎన్నార్ లవ్, ఎమోషనల్, రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ద్వారా పాప్యులర్ అయ్యారు. 
 

ఏఎన్నార్ నట వారసుడిగా నాగార్జున పరిశ్రమలో అడుగుపెట్టాడు. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగాడు. తన ఇమేజ్ ఛట్రం నుండి బయటకు వచ్చి ప్రయోగాత్మక చిత్రాలతో భారీ విజయాలు అందుకున్నారు. నాగార్జునకు మొదట్లో లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. అమ్మాయిల కలల రాకుమారుడు. మజ్ను, గీతాంజలి చిత్రాలతో క్లాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. 

జానకి రాముడు, కిల్లర్, శివ, అంతం, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, హలో బ్రదర్స్... నాగార్జునను మాస్, కమర్షియల్ హీరోగా మార్చాయి. తండ్రి నాగేశ్వరరావు నట వారసత్వాన్ని నిలబెడుతూ నాగార్జున అగ్ర హీరోల్లో ఒకరిగా ఎదిగారు. నాగార్జున నటించిన అన్నమయ్య భక్తిరస చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్. నాగార్జున ఇమేజ్ కి అన్నమయ్య పాత్ర చేసి విజయం సాధించడం గొప్ప పరిణామం. 
 

Latest Videos


నాగార్జున కెరీర్లో అన్నమయ్య మైలురాయిగా నిలిచిపోయింది. నాగార్జున వ్యాపారవేత్త కూడాను. అన్నపూర్ణ స్టూడియో ద్వారా పరిశ్రమకు తనదైన సేవలు అందిస్తున్నారు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున పదుల సంఖ్యలో చిత్రాలు, సీరియల్స్ నిర్మించారు. అటు టెలివిజన్ హోస్ట్ గా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. 

2014లో మొదటిసారి మీలో ఎవరు కోటీశ్వరుడు? షో తెలుగులో ఇంట్రడ్యూస్ చేశారు. కోన్ బనేగా కరోడ్ పతి కి ఇది తెలుగు వెర్షన్ అని చెప్పవచ్చు. మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో నాగార్జున హోస్టింగ్ చాలా ఆకర్షణీయంగా ఉండేది. ప్రేక్షకులు బాగా ఇష్టపడేవారు. 
 

ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 2017లో సీజన్ వన్ ప్రసారం కాగా ఎన్టీఆర్ హోస్ట్. ఇక సీజన్ 2కి నాని హోస్ట్ గా ఉన్నారు. 2019 నుండి ఆ బాధ్యత నాగార్జున తీసుకున్నారు. సీజన్ 8 ప్రసారం అవుతుండగా... వరుసగా ఆరోసారి నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 

అయితే నాగార్జునను ఏఎన్నార్ హీరో చేయాలని అనుకోలేదట. అసలు నాగార్జున నటుడు అవుతాడన్న ఆలోచన ఏఎన్నార్ కి లేదట. ఓ సందర్భంలో ఏఎన్నార్ మాట్లాడుతూ.. నాగార్జున కొలంబియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివాడు. చదువు పూర్తయ్యాక ఇండియా వచ్చాడు. ఒక ఏడాది సమయం తీసుకున్నాడు. ఈ లోగా పెళ్లి చేశాను. 

మరి ఏ పరిశ్రమ పెట్టాలని అనుకుంటున్నావు? దానికి ఎలాంటి అనుమతులు కావాలి? అని ఏఎన్నార్ నాగేశ్వరరావును అడిగాడట. నేను నటుడు కావాలని అనుకుంటున్నాను అన్నాడట. దాంతో ఏఎన్నార్ ఒకింత షాక్ అయ్యాడట. అప్పుడు డాన్సులు, డైలాగ్ డెలివరీలో శిక్షణ ఇప్పించాడట. ముంబైలో ఒకరి వద్ద నాగార్జున శిక్షణ తీసుకున్నాడట. ఆ విధంగా బిజినెస్ మెన్ అవుతాడనుకున్న నాగార్జున హీరో అయ్యాడట. 

ఇక నాగార్జున నట వారసులుగా నాగ చైతన్య, అఖిల్ ఎంట్రీ ఇచ్చారు. 2009లో జోష్ మూవీతో నాగ చైతన్య హీరో అయ్యారు. ఆ మూవీ పర్లేదు అనిపించుకుంది. రెండో మూవీ ఏమాయ చేసావేతో ఫస్ట్ హిట్ అందుకున్నాడు. 100 % లవ్, మనం వంటి చిత్రాలు నాగ చైతన్యను హీరోగా నిలబెట్టాయి. టైర్ టు హీరోల జాబితాలో చేర్చాయి. 
 

ప్రస్తుతం ఆయన పరాజయాల్లో ఉన్నారు. నాగ చైతన్య గత రెండు చిత్రాలు థాంక్యూ, కస్టడీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దర్శకుడు చందూ మొండేటితో తండేల్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తండేల్ తెరకెక్కుతుంది. త్వరలో విడుదల కానుంది. 

ఇక నాగార్జున రెండో కుమారుడు అఖిల్ కి ఇంకా బ్రేక్ రాలేదు. 2015లో అఖిల్ అనే మూవీతో అతడు హీరోగా మారాడు. పరిశ్రమకు వచ్చి దాదాపు పదేళ్లు అవుతున్నా అఖిల్ ప్రభావం చూపలేకపోయాడు. ఆయన గత చిత్రం ఏజెంట్ డిజాస్టర్ కావడంతో.. మరో కొత్త ప్రాజెక్ట్ ఇంకా ప్రకటించలేదు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం బయటకు వెళ్లేది ఎవరు?

click me!