మల్లికకు తుడుస్తది అని అనగా గర్భవతి కదా మావయ్య నేను చేస్తానులే అంటుంది జానకి. ఇంతట్లో మల్లికా అక్కడికి వచ్చి తడిగుడ్డ పట్టుకుని ఒత్తుతూ అత్తయ్య గారు మాటే శాసనం, అత్తయ్య గారు ఏం చెప్తే అదే చేస్తాను అని కావాలని జ్ఞానాంబ వస్తున్నప్పుడు అరుస్తూ ఉంటుంది. ఇంతట్లో జ్ఞానం నువ్వు పని చేయొద్దు మల్లికా అసలకే ఒంటిమనిషి కూడా కాదు అని చెప్పి జానకిని పిలిచి నీకు పని చెప్పకూడదని అనుకున్నాను జానకి, కానీ ఈ సమయానికి ఇంక మనకి దిక్కులేదు అని అనగా పర్వాలేదు అత్తయ్య గారు నేను చేస్తాను అని అంటుంది జానకి.