Intinti Gruhalakshmi: నిజాన్ని బయటపెట్టి షాకిచ్చిన విక్రమ్ తాత.. అత్తతో ఆట మొదలుపెట్టిన దివ్య!

Published : May 13, 2023, 08:36 AM IST

Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. సమస్యలలో ఉన్న తన కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ధైర్యంగా పోరాటం చేస్తున్న ఒక స్త్రీ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 13 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Intinti Gruhalakshmi: నిజాన్ని బయటపెట్టి షాకిచ్చిన విక్రమ్ తాత.. అత్తతో ఆట మొదలుపెట్టిన దివ్య!

ఎపిసోడ్ ప్రారంభంలో నువ్వు చెప్పినట్లే ఓపిక పడతాము. అప్పుడుగాని లాస్యకి అన్యాయం జరిగిందంటే మాత్రం ఊరుకోము. తనకోసం మేము ఉన్నాము అంటూ ఆవేశంగా మాట్లాడి వెళ్లిపోతారు మహిళామణులు. మీ ఎవర్ని వదిలిపెట్టను అంటూ లాస్య కూడా బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఆలోచనలో ఉన్న దివ్య ప్రియని పిలుస్తుంది. ఆమె రావటానికి భయపడుతుంది.

29

ఎందుకు తప్పించుకోవాలని చూస్తున్నావు నువ్వు సమస్యల్లో ఉన్నావో నేను సమస్యల్లో ఉన్నాను అర్థం కావడం లేదు దయచేసి నోరు విప్పు అని అడుగుతుంది దివ్య. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ వాళ్ళ తాతయ్య తను మాట్లాడలేదు తను ఈ ఇంటి కట్టు బానిస. మనమందరం మీ అత్తగారి కబంధహస్తాల్లో ఉన్నాము అంటాడు.
 

39

మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటూ షాక్ అవుతుంది దివ్య. అత్తగారు ఈయనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు అంటుంది. డబ్బు కోసం అలా నటిస్తుంది తను, తన ప్రేమ, తన అభిమానం అన్ని అబద్దమే అందుకు నిలువెత్తు సాక్ష్యం నేనే. ఆవిడ ఆవిడాలని భరించలేక మేమందరం చేతులు ఎత్తేసాము అంటాడు. ప్రియ అంటే ఇష్టం ఉండదని తెలుసు కానీ నేనంటే ఎందుకు ఇష్టం ఉండదు అంటుంది దివ్య.

49

నన్ను ఈ ఇంటి కోడల్ని చేసింది మీరే కదా అందుకే పంతంతోనే మిమ్మల్ని కోడలిగా చేసుకున్నారు అంటూ నోరు విప్పుతుంది ప్రియ. అప్పటికి పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రియ నాకు నిజం చెప్పి మంచి పని చేశారు. ఆవిడ తోవలోనే వెళ్లి ఆవిడని ఒక ఆట ఆడుకుంటాను కంటికి కనిపించని యుద్ధం చేస్తాను. నన్ను దీవించండి అంటూ తాతయ్య ఆశీర్వచనం తీసుకుంటుంది.

59

ఈ యుద్ధంలో నీ భర్త సపోర్ట్ నీకు ఉండదు వాడు మీ అత్తగారికి మూఢ భక్తుడు. నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది అంటూ దీవిస్తాడు తాతయ్య. ప్రియ కూడా సంతోషిస్తుంది. మరోవైపు లాస్య చేసిన అవమానాన్ని తలుచుకుంటూ విపరీతంగా డ్రింక్ చేస్తూ ఉంటాడు నందు. అతని దగ్గర నుంచి బాటిల్ లాక్కుంటుంది తులసి. నా మనాన నన్ను వదిలేయ్ నీకు నాకు ఏం సంబంధం అంటాడు నందు.
 

69

అయితే తాగండి అంటూ బాటిల్ ఇస్తుంది తులసి. బాధతో బాటిల్ ని నేలకేసి కొట్టేస్తాడు నందు. నిన్ను సమస్యల్లోకి లాగకూడదు అనుకున్నాను కానీ నాతో పాటు నిన్ను కూడా నానా మాటలు అన్నారు వాళ్ళు అంటూ బాధపడతాడు నందు. సంధి వొద్దు యుద్ధం కావాలి అనుకున్నారు అలాంటప్పుడు ఇలాంటివన్నీ భరించాలి అంటుంది తులసి. నా వాళ్ళు బాధ పడితే నేను చూడలేను నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటాడు నందు.
 

79

అప్పుడు నిందని నిజం చేసినట్లుగా అవుతుంది. సమస్యని ధైర్యంగా ఎదుర్కోండి అంటుంది తులసి. తప్పు చేశానని ఫీలింగ్ లాస్య మనసులో అస్సలు లేదు అంటాడు నందు. తను అప్పుడు ఇప్పుడు ఒక్కలాగే ఉంది. మీ కళ్ళకి ఉన్న పొర ఇప్పుడు కరిగిపోయి నిజాన్ని గ్రహిస్తున్నారు అంతే నేను వెళ్లి లాస్యతో మాట్లాడి ఇంటికి తీసుకు వస్తాను అంటుంది తులసి.
 

89

ఇంటికి తీసుకువస్తే తనని చంపేస్తాను జీవితాంతం జైల్లో అయినా కూర్చుంటాను కానీ తనని భరించలేను అంటూ ఫ్రెస్ట్రేట్ అవుతాడు నందు. మరోవైపు రాజ్యలక్ష్మి, బసవయ్య మాట్లాడుకుంటూ ఉంటారు. రాజ్యలక్ష్మి మరదల్ని కాఫీ కావాలి అని అడుగుతుంది. ఇప్పుడే తెస్తాను అని వెళ్లే లోపు దివ్య కాఫీ తీసుకొని వస్తుంది. నాకు కాఫీ తాగాలనిపించిందని నీకు ఎలా తెలుసు అంటుంది రాజ్యలక్ష్మి. తెలిసిపోతుంది అత్తయ్య మీరు నా గురించి ఆలోచిస్తున్నారు నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. రెండు నిమిషాలు నా కళ్ళల్లోకి చూస్తే మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పేస్తాను అంటుంది దివ్య. 

99

అదంతా కాదు గాని మా ఆయన కళ్ళల్లోకి చూసి నా గురించి ఏమనుకుంటున్నాడో చెప్పు అంటుంది బసవయ్య భార్య. అలాగ్గాని చేసి నా కాపురంలో నిప్పులు పోయకు అంటాడు బసవయ్య. ఆమె మనసులో ఏముందో తెలిస్తే గుండె ఆగి చస్తావు అనుకుంటాడు బసవయ్య. తరువాయి భాగంలో అవతలి వైపు లాయర్ తో ఎలా మాట్లాడాలో పరంధామయ్య వాళ్ళని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు  మాధవి భర్త. దొంగ సాక్షాలని సిద్ధం చేసుకుంటూ ఉంటుంది లాస్య. మరోవైపు తులసికి ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటుంది.

click me!

Recommended Stories