Published : Apr 05, 2025, 12:06 PM ISTUpdated : Apr 05, 2025, 12:07 PM IST
దివ్య భారతి 32వ వర్ధంతి నేడు(05 ఏప్రిల్). కెరీర్ లో చాలా తక్కువ టైమ్ లో తక్కువ సినిమాలతో స్టార్ డమ్ సంపాదించిన దివ్య భారతి మరణించే నాటికి 10 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇక ఆసినిమాలను ఇతర హీరోయిన్లతో రీప్లేస్ చేసి పూర్తి చేశారు మేకర్. దివ్య భారతి వదిలేసిన సినిమాలను పూర్తి చేసిన స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
Divya Bharti Unfinished Films: దివ్య భారతి చనిపోయి 32 ఏళ్లు అయింది. ఆమె 1993లో బిల్డింగ్ నుంచి పడి మరణించింది. ఆమె తన కెరీర్‌లో చాలా తక్కువ టైమ్ లోనే ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. చిన్న వయస్సులోనే పెద్ద సక్సెస్ ను , స్టార్ డమ్ ను చూసిన ఈ హీరోయిన్ 19 ఏళ్లకే మరణించింది. దివ్య భారతి చనిపోయే ముందు దాదాపు 10 సినిమాల్లో షూటింగ్ చేస్తోంది. ఆమె మరణం తర్వాత, మేకర్స్ దివ్య పూర్తి చేయని సినిమాలను ఇతర హీరోయిన్ల పూర్తి చేశారు. ఆ సినిమాల గురించి తెలుసుకుందాం.
1993లో విడుదలైన ధనవాన్ సినిమాలో దివ్య భారతి హీరోయిన్ గా కొన్ని సీన్లలో నటించింది. ఆమె మరణం తరువాత ఆ స్థానంలో కరిష్మా కపూర్ నటించింది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, మనీషా కోయిరాలా కూడా నటించారు.
1994లో వచ్చిన లాడ్లా సినిమాలో దివ్య భారతి స్థానంలో దివంగత తర శ్రీదేవి నటించింది. అనిల్ కపూర్ కలిసి నటించిన ఈ సినిమా హిట్ అయింది. ఈసినిమాతో శ్రీదేవి నటనకు మంచి పేరు వచ్చింది.
1994లో వచ్చిన మొహ్రా, దిల్వాలే సినిమాల్లో దివ్య భారతి స్థానంలో రవీనా టాండన్ నటించింది. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు రవీనాను స్టార్‌ను చేశాయి.
1995లో వచ్చిన ఆందోళన్ సినిమాలో దివ్య భారతి నటించాల్సిన స్థానంలో మమతా కులకర్ణి నటించింది. గోవిందా హీరోగా నటించిన ఈ సినిమా కూడా హిట్ అయింది.
710
1995లో వచ్చిన కర్తవ్య సినిమాలో దివ్య భారతి స్థానంలో జూహీ చావ్లా నటించింది. సంజయ్ కపూర్‌తో కలిసి నటించిన ఈ సినిమా కూడా బాలీవుడ్ లో యావరేజ్ గా ఆడింది.
810
1995లో వచ్చిన కన్యాదాన్ సినిమాలో మనీషా కోయిరాలా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో దివ్య భారతి స్థానంలో మనీషా కు అవకాశం వచ్చింది.
910
1995లో వచ్చిన హల్చల్ సినిమాలో కాజోల్ దివ్య భారతి స్థానంలో నటించింది. అజయ్ దేవగన్‌తో కలిసి నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో హిట్ గా నిలిచింది.
1010
సన్నీ డియోల్ హీరోగా అంగరక్షక్ సినిమా 1995లో వచ్చింది. ఇందులో పూజా భట్ దివ్య భారతి స్థానంలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా పర్వాలేదు అనిపించింది. ఇలా 10కి పైగా సినిమాలు దివ్య భారతి మరణంతో హీరోయిన్లను మార్చుకోవలసి వచ్చింది. దివ్య భరతి మరణించకుండా ఉంటే..ఈ సినిమాలన్నీ కంప్లీట్ చేసి స్టార్ హీరోయిన్ గా చరిత్ర సృష్టించేది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాధించుకుంది దివ్య భారతి.