చిరంజీవి అంకుల్ అంటే నాకు పిచ్చి, ఆయనపై అందుకే క్రష్.. ఆ పాట పాడి సర్ప్రైజ్ చేసిన రజనీ కూతురు 

మెగాస్టార్ చిరంజీవి తన నటన, డ్యాన్సులతో కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్నారు. సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాదు బడా సెలెబ్రిటీలు కూడా చిరంజీవికి అభిమానులే. ఒక దశలో చిరంజీవి.. అమితాబ్ ని మించి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుని ఇండియాలోనే టాప్ హీరోగా నిలిచారు.

Rajinikanth Daughter Aishwarya says i have crush on Chiranjeevi in telugu dtr

మెగాస్టార్ చిరంజీవి తన నటన, డ్యాన్సులతో కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్నారు. సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాదు బడా సెలెబ్రిటీలు కూడా చిరంజీవికి అభిమానులే. ఒక దశలో చిరంజీవి.. అమితాబ్ ని మించి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుని ఇండియాలోనే టాప్ హీరోగా నిలిచారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ కి అయితే ఇండియా మొత్తం క్రేజ్ ఉంది. జపాన్ లాంటి దేశాల్లో కూడా రజనీకి అభిమానులు ఉన్నారు. 

Rajinikanth Daughter Aishwarya says i have crush on Chiranjeevi in telugu dtr
aishwarya rajinikanth

చిరంజీవి, రజనీకాంత్ వాళ్ళ కెరీర్ బిగినింగ్ లో కలసి నటించారు. రజనీకాంత్ కి తన కుమార్తెలు ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్ అంటే పంచప్రాణాలు. వీళ్ళిద్దరూ తండ్రి పట్ల కూడా అంతే ప్రేమగా ఉంటారు. ఇటీవల రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్ విడాకులు తీసుకుని విడిపోయారు. 


megastar chiranjeevi

అయితే ఐశ్యర్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్న తనంలో తనకి ఒక హీరోపై క్రష్ ఉండేది అని తెలిపింది. ఐశ్వర్య రజనీకాంత్ కి హీరోపై క్రష్ అంటే ఎవరో తమిళ హీరో అయి ఉంటాడు లేదా ప్రస్తుతం స్టార్ గా రాణిస్తున్న యంగ్ హీరోల్లో ఒకరని అనుకుంటారు. కానీ ఐశ్వర్య రజనీకాంత్ కి క్రష్ ఉన్నది యంగ్ హీరో లేదా తమిళ హీరోలపై కాదు. ఐశ్వర్య ఆ హీరో ఎవరో స్వయంగా రివీల్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిపై తనకి చిన్నప్పటి నుంచి క్రష్ ఉందని అన్నారు. 

megastar chiranjeevi

చిరంజీవి అంకుల్ అంటే నాకు పిచ్చి. చిన్నతనయంలో ఆయన డ్యాన్స్ పై విపరీతమైన ఇష్టం ఉండేది. బంగారు కోడిపెట్ట సాంగ్ ని రిపీట్ గా చూసేదాన్ని అంటూ ఐశ్వర్య ఆ సాంగ్ పాడి సర్ప్రైజ్ చేశారు. తమిళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఐశ్వర్య రజనీకాంత్ తెలిపారు. నేను తలైవా కూతుర్ని. ఆయనపై ఎలాగూ ఇష్టం ఉంటుంది. తలైవా కాకుండా తనకి చిరంజీవి అంకుల్ అంటే చాలా ఇష్టం అని ఐశ్యర్య పేర్కొంది. చిరంజీవి డ్యాన్స్ అంటే టివికి అతుక్కుపోయి చూసేదాన్ని అని ఐశ్వర్య తెలిపారు. 

Aishwarya Rajinikanth

ఐశ్వర్య రజనీకాంత్ మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. దర్శకురాలిగా, సింగర్ గా కూడా రాణించారు. ధనుష్ హీరోగా ఆమె తెరకెక్కించిన 3 చిత్రానికి ప్రశంసలు దక్కాయి. కానీ ఆ చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. 

Latest Videos

vuukle one pixel image
click me!