Intinti Gruhalakshmi: నందు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న దివ్య.. విక్రమ్ కి నిజం చెప్పాలనుకుంటున్న ప్రియ?

Published : Apr 05, 2023, 09:36 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఏప్రిల్ 5వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.  

PREV
18
Intinti Gruhalakshmi: నందు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న దివ్య.. విక్రమ్ కి నిజం చెప్పాలనుకుంటున్న ప్రియ?

ఈరోజు ఎపిసోడ్ లో రాజ్యలక్ష్మి మావాడు దాని మెడలో పసుపు తాడు వేస్తాడు. ఆ వెంటనే నేను పలుపుతాడు వేస్తాను. దాని బలుపు తగ్గేలా చేస్తాను అని అంటుంది. అప్పుడు ప్రియ రాజ్యలక్ష్మి దగ్గరికి వెళ్లి దయచేసి వాళ్ళని హ్యాపీగా ఉండనివ్వండి మేడం నా మీద పగ తీర్చుకోండి అని రాజ్యలక్ష్మి వేడుకుంటూ ఉంటుంది. పగ నీ మీద కాదు దానిమీద నీలాగే అది కూడా నా కాళ్ళ మీద పడి క్షమాపణలు అడగాలి. వెక్కి వెక్కి ఏడ్చాలి అని అంటుంది. దాని చేతులతోనే వేయించిన నీ మెడలో తాళి దాని చేతులతోనే తీయిస్తాను అప్పుడు దాని గురించి ఆలోచిస్తాను అని అంటుంది. అప్పుడు రాజ్యలక్ష్మి మాటలకు ప్రియ ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత దివ్య పరందామయ్య గేమ్ ఆడుతూ ఉండగా పక్కనే అనసూయ తింటూ ఉంటుంది.
 

28

అప్పుడు చెస్ లో దివ్య గెలవడంతో అబ్బా దివ్య ఇందాకట్నుంచి మీ నానమ్మ తెగ డిస్ట్రబ్ చేస్తోంది పక్కకు వెళ్ళమని చెప్పు అని అంటాడు. నా తిండి నా ఇష్టం అనగా అని తిండి మాత్రమే నా తిండి నుండి కూడా తింటున్నావు నా కడుపు తరుక్కుపోతుంది అని అంటాడు పరంధామయ్య. అవును తాతయ్య నేను వెళ్ళిపోయాక ఎవరితో ఆడతావు అనడంతో ఎవరితో ఆనందం శాశ్వతం కాదమ్మా అని అంటాడు. అప్పుడు వాళ్ళు గేమ్ ఆడుతూ ఉండగా ఇంతలో తులసి నందు రెండు వెడ్డింగ్ కార్డులు తీసుకుని వచ్చి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయమని చెబుతారు. అప్పుడు దివ్య ఏది సెలెక్ట్ చేయాలో అర్థం కాక దివ్య అయోమయపడుతూ ఉంటుంది.
 

38

అప్పుడు తులసి తన మనసులో నాకు తెలుసమ్మ నీకు నా సెలక్షన్ నచ్చుతుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు నందు తెచ్చిన సెలక్షన్ బాగుంది అనడంతో సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు తులసి వాళ్ళందరూ దివ్యని చూసి మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటారు. మరోవైపు రాజ్యలక్ష్మి మీ ఇంట్లో మురిపాలు ముచ్చట్లు సంతోషాలు ఎన్నో రోజులు ఉండవులే దివ్య అని కోపంతో మాట్లాడుతూ ఉంటుంది. అతి త్వరలోనే మాయం కాబోతున్నాయి అని అంటుంది. అప్పుడు నందు దివ్య పుట్టినప్పుడు తీసిన వీడియోని చూసి ఆనందపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి తులసి వస్తుంది. అప్పుడు తులసి కూడా ఆ వీడియోని చూసి సంతోషపడుతూ ఉంటుంది.
 

48

అప్పుడు వాళ్ళిద్దర్నీ చూసి దివ్య కూడా సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు తులసి చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మాట్లాడటంతో దివ్య ఆ మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు దివ్య నన్ను చిన్నప్పుడు కలవరించేది కానీ ఇప్పుడు నన్ను దివ్య మాట్లాడుతున్నా కూడా నాపై తనకు ప్రేమ కనిపించడం లేదు అని బాధగా మాట్లాడుతాడు నందు. దివ్య విషయంలో తాను ఎంత బాధపడ్డాడో నందు పైకి చెప్పడంతో దివ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు దివ్య పరిగెత్తుకుంటూ వచ్చి డాడీ అని నందుని హత్తుకుంటుంది. అప్పుడు తులసిని హత్తుకుంటుంది. నాన్న నీ మీద నాకు ఎప్పటికీ కోపం లేదు నాన్న అమ్మకి దూరం అయ్యారు.
 

58

 అమ్మని వంటరీ దాన్ని చేశారు అన్న కోపం మాత్రమే ఉండేది. అప్పుడు అమ్మ వైపు మాట్లాడాలో మీ వైపు మాట్లాడాలో తెలియక చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాను అని దివ్య ఏడుస్తూ మాట్లాడడంతో ఆ మాటలకు తులసి నందు ఇద్దరు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ ఒక్క విషయం తప్పితే నువ్వు ఎప్పుడూ నా హీరోవే నాన్న అని దివ్య హత్తుకుంటుంది. అప్పుడు అందరూ దివ్య గురించి ఎమోషనల్ గా మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటారు. మరొకవైపు రాజ్యలక్ష్మి ప్లాన్ గురించి తెలుసుకున్న ప్రియ దివ్యకి ఎలా అయినా సమాచారాన్ని చేరవేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.
 

68

దివ్య నగలు తీసుకుని వెళ్లడానికి దివ్య వాళ్ళ అమ్మ వస్తుందని విన్నాను ఆవిడకు వచ్చినప్పుడు ఏదో ఒకటి చేసే ఆవిడకు నిజం చెప్పేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రియ. ఇంతలోనే రాజ్యలక్ష్మి ఫోన్ మాట్లాడుతూ అక్కడికి వచ్చి దివ్య వాళ్ళ అమ్మని నగలు తీసుకొని వెళ్లడానికి ఇక్కడికి రమ్మన్నాను కానీ బాగుండదని చెప్పి జువెలరీ షాప్ అతన్నే వాళ్ళ ఇంటికి పంపించాను అని అంటుంది. అప్పుడు ప్రియ మనసులో ఈ అవకాశం కూడా చేయి జారిపోయిందా ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు విక్రం బావకి చెప్పడం తప్పవేరే దారి లేదు అనుకుంటూ ఉంటుంది ప్రియ. మరోవైపు పరంధామయ్య నా మనవరాలు విక్రమ్ ని పెళ్లి చేసుకోవడంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటో చెప్పండి అనడంతో అందరు ఎన్ని సమాధానాలు  చెప్పిన ఒప్పుకోడు.
 

78

మీరే చెప్పండి తాతయ్య అని దివ్య అనడంతో హాస్పిటల్ ఎండీ మీ అత్తయ్య కాబట్టి హాస్పటల్ కి ఎన్ని రోజులుగా లీవులు పెట్టుకోవచ్చు అనే కామెడీ చేసిన అవ్వగా అందరూ మౌనంగా ఉంటారు. ఏంటి ఎవరు నవ్వడం లేదు అని అనగా ఏడ్చినట్టే ఉంది. అంటూ అనసూయ సెటైర్లు వేయగా అందరు నవ్వుతూ ఉంటారు. అప్పుడు అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే రాజ్యలక్ష్మి పంపించిన నగలు చీరలు రావడంతో మా అత్తయ్య గారు పంపించారు అని దివ్య అనగా చూశారా అప్పుడే మా అత్తయ్య గారు అంటుంది అని అనసూయ జరగడంతో అయితే నాకు ఈ పెళ్లి వద్దు అంటుండగా లాస్య టెన్షన్ పడుతున్న బ్రీఫ్ కేస్ ఏమవుతుంది అనుకుంటూ ఉంటుంది.
 

88

చూసారా ఆంటీ ఎలా ఏడిపిస్తున్నారు అనడంతో సరదాగా అంటున్నారు లే అని అంటుంది లాస్య. నానమ్మ అలా పనికి కనిపిస్తోంది కానీ నువ్వు లోలోపల బాధపడుతోంది అనగా నానమ్మ సారీ అని అంటుంది దివ్య. మరోవైపు విక్రమ్ దివ్య ఏంటి పెళ్లి సెట్ అవ్వగానే నన్ను పట్టించుకోవడం మానేసింది అనుకుంటూ దివ్య కి ఫోన్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ప్రియ టెన్షన్ టెన్షన్ గా విక్రం వైపు చూస్తుండగా అది గమనించిన బసవయ్య ఈ పిల్ల ఏదో ప్లాన్ చేసినట్టు ఉంది ప్రియా వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు విక్రమ్ బావ ఒక్కడే ఉన్నాడు ఎలా ఉన్నా వెళ్లి నిజం చెప్పేస్తాను అని అక్కడికి వెళుతుంది ప్రియ.

click me!

Recommended Stories