సుడిగాలి సుధీర్‌తో టీఆర్‌పీ లవ్‌.. హైపర్‌ ఆదితో అసలు రొమాన్స్.. నెటిజన్‌కి చుక్కలు చూపించిన యాంకర్‌ రష్మి

Published : Apr 05, 2023, 09:30 AM IST

యాంకర్‌ రష్మి, సుడిగాలి సుధీర్‌ లవ్‌ లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సుధీర్‌ స్థానంలో హైపర్‌ ఆది అంటూ పెట్టిన పోస్ట్‌, దానికి రష్మి రియాక్షన్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది.   

PREV
16
సుడిగాలి సుధీర్‌తో టీఆర్‌పీ లవ్‌.. హైపర్‌ ఆదితో అసలు రొమాన్స్.. నెటిజన్‌కి చుక్కలు చూపించిన యాంకర్‌ రష్మి

`జబర్దస్త్` యాంకర్‌గా రష్మి గౌతమ్‌ పాపులర్‌ అయ్యింది. మరోవైపు ఈ షోతోనే స్టార్‌ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్‌. వీరిద్దరు ఈ షోలో అనేకసార్లు ప్రేమని వ్యక్తం చేసుకున్నారు, డ్యూయెట్లు పడుకున్నారు. నువ్వు లేకపోతే నేను లేను అనే మనసులోని మాటలను చెప్పుకున్నారు. నిజమైన లవర్స్ లాగానే యాక్ట్ చేసి ఆకట్టుకున్నారు. `జబర్దస్త్` షోకి కావాల్సిన టీఆర్‌పీ రేటింగ్‌ని తీసుకొచ్చారు. అయితే ఇటీవల ఈ ఇద్దరు దూరమయ్యారు. సుధీర్‌.. జబర్దస్త్ ని వదిలేయడంతో ఇప్పుడు ఎవరి కెరీర్‌లో వాళ్లు బిజీగా ఉన్నారు. కానీ తరచూ వీరిద్దరి రిలేషన్‌షిప్స్ పై కామెంట్లు వస్తూనే ఉంటాయి. అయితే తాము మాత్రం మంచి స్నేహితులమని ఇద్దరూ చెప్పుకోవడం విశేషం. 
 

26

సుడిగాలి సుధీర్‌.. రష్మి మళ్లీ కలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. తమ మనసులో వీరిద్దరిని జంటగానే చూస్తున్నారు అభిమానులు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనే డిమాండ్‌ కూడా వినిపిస్తుంటుంది. కానీ వీరి నుంచి నో రెస్పాన్స్. అయితే సుధీర్‌ వెళ్లిపోవడంతో రష్మి ఒంటరైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త లవ్‌ ట్రాక్‌ తెరపైకి వస్తుంది. రష్మి.. హైపర్‌ ఆదితో రొమాన్స్ చేస్తుందని, ఈ ఇద్దరిది నిజమైన ప్రేమ అని ఓ నెటిజన్‌ చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌ ఓ నెటిజన్‌.. చేసిన పోస్ట్ కి రష్మి కౌంటర్‌ ఇప్పుడు వైరల్‌గా, హాట్‌ టాపిక్‌గా, షాకింగ్‌గా మారింది. 

36

సదరు నెటిజన్‌ చేసిన పోస్ట్ చూస్తే, ఆదితో రష్మి క్లోజ్‌గా ఉన్న ఓ ఫోటోని పంచుకుంటూ ఇది రష్మి గౌతమ్‌ వైల్డ్ రొమాంటిక్‌, ఆమె హైపర్‌ ఆదిని చాలా ప్రేమిస్తుంది. కానీ సుడిగాలి సుధీర్‌తో ప్రేమ కేవలం టీఆర్‌పీ కోసమే. ఇది చూసి ఇంద్రజ మేడమ్‌ షాక్‌, స్టన్‌ అయ్యింది` అని పేర్కొన్నాడు ఓ నెటిజన్‌. ఇది అటు ఇటు తిరిగి చివరికి రష్మికి చేరింది. దీంతో మండిపోయిన జబర్దస్త్ యాంకర్‌ ఆ నెటిజన్ కి చుక్కలు చూపించే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. 
 

46

ఆ నెటిజన్‌ చేసిన పోస్ట్ ని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకుంటూ అతని నిజ స్వరూపం బయటపెట్టింది. అతను పదే పదే తనని టార్గెట్‌ చేస్తున్నాడని, తనని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని వెల్లడించింది. ఈ టాపిక్‌(లవ్‌)ని చూపిస్తూ తన అటెన్షన్‌ క్రియేట్‌ చేసుకోవాలనుకుంటున్నాడు. తనతో ఏదైనా మాట్లాడాలనుకుంటే వేరే ఫ్లాట్‌ఫామ్‌లో చూసుకుందామని తెలిపింది. ఇక పర్సనల్‌ వాట్సాప్‌ ఛాట్‌ని షేర్‌ చేసింది రష్మి గౌతమ్‌. 
 

56

ఇందులో ఆ నెటిజన్‌కి చుక్కలు చూపించింది రష్మి గౌతమ్‌. ఇది రేపు పెద్ద న్యూస్‌ అవుతుందని, దానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించింది. నా లైఫ్‌ని మీరు డిసైడ్‌ చేస్తారా? అంటూ ప్రశ్నించింది. పోలీస్‌ కేసు పెడతానని హెచ్చరించింది. దీనికి ఆ నెటిజన్ సారీ చెప్పాడు. ఇది మళ్లీ రిపీట్‌ కాదని వెల్లడించింది. ఇదే చివరి సారి అని, ఇక ఇన్‌స్టాగ్రామ్‌ ని ఇలా వాడనని తెలిపాడు. దయజేసి ఈ పోస్ట్ ని డిలీట్‌ చేయాలని వేడుకున్నాడు. తమ ఫ్యామిలీ చూస్తే బాగోదని వాపోయాడు. దీనికి రష్మి రియాక్ట్ అవుతూ నీకే ఫ్యామిలీ ఉందా, మాకు లేదా అంటూ మండిపడింది. పోలీస్‌ స్టేషన్‌కి వచ్చిన పోలీసుల ముందు సారీ చెప్పాలని తెలిపింది.

66

 దీంతో ఆ నెటిజన్ల మరింతగా ప్రాధేయపడటం ప్రారంభించాడు. నేను కేసు ఫైల్‌ చేయాలా లేదా మీరు నిర్ణయించుకోండి గాయ్స్ అంటూ వెల్లడించింది రష్మి. మొత్తానికి రష్మి దెబ్బకి విలవిలలాడిపోయాడు నెటిజన్లు. అంతేకాదు ఇది ఇలాంటి కామెంట్లు చేసేవారికి ఓ గుణపాఠంలానూ నిలుస్తుందని చెప్పొచ్చు. మరి రష్మి పై కామెంట్ చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ట్రోలర్స్ గ్రహించాలి. రష్మి గౌతమ్‌ ప్రస్తుతం `జబర్దస్త్` షోకి యాంకర్‌గా చేస్తుంది. దీంతోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి యాంకరింగ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories