Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమౌతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) అనే ధారావాహిక రోజుకొక కొత్త కొత్త మలుపులతో అందరినీ ఆకట్టుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఈ సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో సాగుతుంది. ఇక ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
హోలీ సందర్భంగా ఇంట్లో దివ్య (Divya) అందరికీ రంగులు పూస్తుంది. కానీ లాస్య కి రంగులు పూయడానికి వెళ్ళినప్పుడు లాస్య (Lasya) దివ్య పై చిరాకు పడుతుంది. దివ్య బాధతో తిరిగి వెళ్తుండగా.. నందు చూస్తాడు. నందు దివ్య దగ్గరకు వెళ్లి తనకు రంగులు పూయమని దివ్య ని అడుగుతాడు. దానికి దివ్య సంతోషించి నందు కి రంగు పూస్తుంది.
26
మరోవైపు అభి (Abhi), అంకిత ఇద్దరూ ప్రేమ్ గురించి ఆలోచిస్తుంటారు. ఆ సమయంలో దివ్య రంగులు పూయడానికి వెళ్ళినప్పుడు ఇద్దరు డల్ గా కూర్చుంటారు. అది చూసి దివ్య మనమే ప్రేమ్ అన్నయ్య దగ్గరికి వెళ్దామని అంటుంది. ప్రేమ్ (Prem) దగ్గరికి వెళ్లడానికి తులసి ఆంటీ ఒప్పుకుంటుందా ? అని అంకిత అంటుంది.
36
ఏదో ఒకటి చెప్పి ప్రేమ్ (Prem) అన్నయ్యని కలుద్దామని దివ్య చెబుతుంది. ఇంట్లో ఉంటే ప్రేమ అన్నయ్య గుర్తుకు వస్తున్నాడని బయటకి వెళ్లి మా ఫ్రెండ్స్ ను కలిసి వస్తామని తులసికి చెప్పి ముగ్గురు కలిసి ప్రేమ్ ఇంటికి వెళ్తారు. ఆ తరువాత తులసి మాధవి (Madhavi) కి కాల్ చేసి మనం ప్రేమ్ ను కలవడానికి వెళ్దాం అని చెప్తుంది.
46
దానికి మాధవి (Madhavi) సరే వదిన అంటుంది. తులసి బయలుదేరి వెళ్తుండగా నందు ఐదు నిమిషాలు ఆగమని ముఖ్యమైన విషయం చెప్పాలని అంటాడు. దానికి తులసి టైం లేదు వచ్చిన తర్వాత మాట్లాడుదాం అంటుంది. దాంతో నందు తులసి (Tulasi)ని తిడతాడు. నందు వాళ్ళ అమ్మానాన్న కూడా తులసి కే సపోర్ట్ చేస్తారు.
56
ఇలా ఉండగా అప్పుడే మాధవి (Madhavi) కాల్ చేస్తుంది. తను ఆటో లో బయట వెయిట్ చేస్తున్నానని చెబుతుంది. నేను కూడా బయలుదేరాను అని చెప్పి వెళ్తుంది. ఇద్దరూ కలిసి ప్రేమ్ ను కలవడానికి వెళతారు. మరోవైపు ప్రేమ్, శృతి, అభి, అంకిత, దివ్య (Divya)
66
అందరూ కలిసి సంతోషంగా హోలీ ఆడుతుంటారు. అప్పుడు దివ్య ప్రేమ్ తో ఆటో లో సరదాగా బయటికి వెళ్దాం అన్నయ్య అని అంటుంది. దానికి అందరూ ఆటో దగ్గరకు వెళుతుండగా తులసి (Tulasi), మాధవి (Madhavi) ఎదురవుతారు.