RRR OTT Confirm: `ఆర్‌ఆర్‌ఆర్‌` ఓటీటీలో వచ్చేది వాటిలోనే.. రాజమౌళి భలే సెట్‌ చేశాడుగా!

Published : Mar 25, 2022, 03:27 PM ISTUpdated : Mar 25, 2022, 03:28 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` వేట మొదలైంది. సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. కాస్త నెగటివ్‌ టాక్‌ ఉన్నా కమర్షియల్‌గా సక్సెస్‌ అవుతుందంటున్నారు. తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విషయంలోనూ క్లారిటీ వచ్చింది. ఇది ఎందులో స్ట్రీమింగ్‌ కాబోతుందంటే..

PREV
16
RRR OTT Confirm: `ఆర్‌ఆర్‌ఆర్‌` ఓటీటీలో వచ్చేది వాటిలోనే.. రాజమౌళి భలే సెట్‌ చేశాడుగా!
rrr movie

ఇప్పుడు ఎక్కడ చూసినా `ఆర్‌ఆర్‌ఆర్‌` మానియా నడుస్తోంది. అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్ తోపాటు జనరల్‌ ఆడియెన్స్ సైతం `ఆర్‌ఆర్‌ఆర్‌`ని స్మరిస్తూ ఊగిపోతున్నారు. రాజమౌళి మరోసారి తన మార్క్ ని చాటుకున్నారనే టాక్‌ బాగా వినిపిస్తున్నా, ఈ సారి రాజమౌళి కన్‌ఫ్యూజ్‌ అయ్యాడనే మరో టాక్‌ సైతం వైరల్‌గా మారింది. బలమైన ఎమోషనల్‌ పాయింట్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`లో మిస్‌ అయ్యిందనే టాక్‌ వినిపిస్తుంది. 

26
rrr movie

అయితే సినిమా టాక్‌ ఎలా ఉన్నా అటు రామ్‌చరణ్‌ ఫ్యాన్స్, ఇటు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ తోనైనా ఈ సినిమా గట్టెక్కుతుంది. భారీ స్థాయిలో సినిమా రిలీజ్‌ కాబోతున్న నేపథ్యంలో కలెక్షన్లు భారీగానే వస్తాయని చెప్పొచ్చు. ప్రపంచ వ్యాప్తంగాఈ చిత్రం దాదాపు పదివేల స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శించబడుతుంది. దీనికితోడు భారీగానే ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్స్ తోనే రికార్డు సృష్టించింది `ఆర్‌ఆర్‌ఆర్‌`. 

36
rrr movie

మొత్తంగా మొదటి రోజు ఓపెనింగ్స్ రూపంలో రూ. 200కోట్ల కలెక్షన్లని రాబట్టబోతుందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. కమర్షియల్‌గా సినిమా బాగానే ఆడుతుందనే టాక్‌ వినిపిస్తుంది. మూడు రోజులపాటు బుకింగ్స్ ఉండటంతో శుక్ర, శని, ఆది వారాల్లోనే `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం నాలుగువందల కోట్లు కలెక్ట్ చేయబోతుందని తెలుస్తుంది. ఈ లెక్కన నిర్మాతలు ఇప్పటికే సేఫ్‌జోన్‌లోకి వెళ్లిపోగా, బయ్యర్లు కూడా సేఫ్‌ అవుతారని చెప్పొచ్చు. 

46
rrr movie

ఇదిలా ఉంటే ఈ సినిమా వచ్చే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లేంటో తేలిపోయింది. గతంలో నెట్‌ఫ్లిక్స్, జీ5 పేర్లు వినిపించాయి. తాజాగా అవే ఖారారయ్యాయి. సౌత్‌ లాంగ్వేజెస్‌లో జీ5లో స్ట్రీమింగ్‌ కాబోతుందని, హిందీతోపాటు ఇతర దేశాల్లో(ఇంగ్లీష్‌, పోర్చుగల్‌, కొరియన్‌, టర్కీష్‌, స్పానిష్‌) నెట్‌ ఫ్లిక్స్ లో `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రదర్శించబోతున్నారట.  అయితే సినిమా విడుదలయ్యాక 90 రోజుల తర్వాత విడుదల చేయాలనే కండీషన్‌ కూడా పెట్టుకున్నట్టు సమాచారం. ఈ లెక్కన జూన్‌లో సినిమా ఓటీటీలోకి రానుంది. మరి ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

56
rrr movie

 మరోవైపు శాటిలైట్‌ హక్కులను జీ నెట్‌వర్క్, స్టార్‌ నెట్‌వర్క్ దక్కించుకోవడం విశేషం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో స్టార్‌ నెట్‌వర్క్ లో, హిందీలో జీ నెట్‌వర్క్ లో సినిమా ప్రసారం కానుంది. ఈ ఓటీటీ, శాటిలైట్‌ హక్కులు రెండు వందల కోట్లకుపైగా అమ్ముడు పోయినట్టు సమాచారం. మొత్తంగా అటుఓటీటీ విషయంలో, ఇటు శాటిలైట్స్ రైట్స్ విషయంలో రాజమౌళి భలేగా సెట్‌ చేశాడని చెప్పొచ్చు. సినిమా తీయడంలోనే కాదు, సినిమాని అమ్మడంలోనూ జక్కన్నని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు.

66
rrr movie

`ఆర్‌ఆర్‌ఆర్‌` రాజమౌళి, విజయేంద్రప్రసాద్‌ మదిలోనుంచి పుట్టిన అద్భుత కళాఖండం. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో అలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌, అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డివివి దానయ్య దాదాపు రూ. 480కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారంతో ఈ సినిమా కలెక్షన్ల వేట ప్రారంభమైంది. మరి `బాహుబలి 2`ని రీచ్‌ అవుతుందా? అనేది చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories