అయితే అంతకు ముందు టైగర్ ష్రాఫ్ సిస్టర్ క్రిష్ణ ష్రాఫ్ దిశాకి మంచి ఫ్రెండ్. ఆమె కోసం వారింటికి వెళ్లగా, టైగర్‌తో పరిచయం ఏర్పడిందని, అది ప్రేమగా మారిందని సమాచారం. అయితే `బాఘి2` సినిమా టైమ్‌లో వీరి ప్రేమ మరింత బలపడిందని టాక్. ఆ తర్వాత `బాఘి 3`లోనూ టైగర్ కోసం స్పెషల్ సాంగ్‌లో మెరిసింది దిశా పటానీ. ఇప్పుడు `ఏక్ విలన్ రిటర్న్స్`, `యోధ`, `కేటీనా` చిత్రాల్లో నటిస్తుంది. దాదాపు ఏడేళ్ల తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ప్రభాస్ సరసన `ప్రాజెక్ట్ కే`లో నటిస్తుంది దిశా. మరోవైపు టైగర్ ష్రాఫ్ సైతం చాలా బిజీగా ఉన్నారు. `స్క్రూ ఢీలా`, `గణపత్‌ః పార్ట్ 1`, `బడేమియా చోటే మియా` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.