ఇక రీసెంట్ న్యూస్ ప్రకారం దిశ కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అయినట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ సీనియర్ హీరో సూర్య సరసన నటించే చాన్స్ అందుకున్నట్టు సమాచారం. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు రీసెంట్ గా. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈసినిమా ఈ మధ్యే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరుపుకుంది.