ప్రభాస్‌ హీరోయిన్‌ దిశా పటాని సంపాదన, కార్లు, ఆస్తులు.. సినిమాలు చేసేది తక్కువే, అన్ని కోట్లు ఎలా వస్తున్నాయి?

Published : Jun 13, 2025, 09:56 AM IST

ప్రభాస్‌ హీరోయిన్‌ దిశా పటానికి 33 ఏళ్ళు నిండాయి. నేడు బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంటున్న దిశా పటానీ 500 రూపాయలతో ముంబాయి వచ్చి ఇప్పుడు కోట్లకు ఎదిగింది. ఆ కథేంటో చూద్దాం.  

PREV
17
ప్రభాస్‌ `కల్కి 2898 ఏడీ`తో దిశా పటాని పాపులర్‌

ప్రభాస్‌తో `కల్కి 2898 ఏడీ` చిత్రంలో నటించి పాపులర్‌ అయిన దిశా పటాని 1992 లో జూన్‌13న బరేలీలో జన్మించంది. ఆమె మొదట పైలట్ కావాలనుకుంది, కానీ సినిమా రంగంలోకి వచ్చింది. 

27
500 రూపాయలతో ముంబై వచ్చిన దిశా పటాని

దిశా పటాని ముంబై వచ్చినప్పుడు ఆమె జేబులో కేవలం 500 రూపాయలు ఉండేవి. ఆమె కష్టపడి కోట్ల ఆస్తి సంపాదించింది. దిశా దగ్గర 75 కోట్ల ఆస్తి ఉంది.

37
ఏడాదికి రూ.12కోట్లు సంపాదిస్తున్న దిశా పటాని

దిశా పటాని నెలకు దాదాపు 1 కోటి రూపాయలు సంపాదిస్తుంది. ఆమె వార్షిక ఆదాయం 12 కోట్ల రూపాయలు.

47
ఏడు కోట్ల పారితోషికం తీసుకుంటున్న దిశా

దిశా పటాని ఒక్కో సినిమాకి 7 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటుంది. సినిమాలతో పాటు యాడ్స్ ద్వారా కూడా  బాగా సంపాదిస్తుంది. ఒక్కో ప్రకటనకు 3 కోట్లు తీసుకుంటుందని సమాచారం. 

57
దిశా ముంబయిలో లగ్జరీ అపార్ట్ మెంట్‌

దిశా పటాని ముంబైలో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది. దాని ధర రూ.5 కోట్లు. ఆమెకు ఇంకో ఇల్లు కూడా ఉందని టాక్‌.

67
దిశా పటాని కార్ కలెక్షన్‌

దిశా పటాని దగ్గర బ్రాండెడ్ కార్ కలెక్షన్‌ ఉంది. ఆమె దగ్గర మెర్సిడెస్ బెంజ్ S450, ల్యాండ్ రోవర్, BMW 7 సిరీస్, హోండా సివిక్, షెవర్లె క్రూజ్, ఆడి A6 కార్లు ఉన్నాయని బాలీవుడ్‌ మీడియా సమాచారం.

77
తెలుగు మూవీ `లోఫర్‌`తో హీరోయిన్‌గా పరిచయం

దిశా పటాని 2015లో తెలుగు సినిమా ద్వారానే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. వరుణ్‌ తేజ్‌, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన `లోఫర్` సినిమాతో తెరంగేట్రం చేసింది. 2016లో `ఎం.ఎస్. ధోని` సినిమాలో నటించింది. 

గతేడాది ప్రభాస్‌తో `కల్కి 2898ఏడీ`లో హీరోయిన్‌గా మెరిసిన విషయం తెలిసిందే. ఇందులో గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఆమె ఇప్పటివరకు 13 సినిమాల్లో నటించింది. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది దిశా. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories