Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి

Published : Dec 22, 2025, 03:28 PM IST

బిగ్ బాస్ తెలుగు 9 షోలో తనకి అవకాశం రావడానికి నాగబాబు కారణం అనే కామెంట్స్ పై భరణి స్పందించారు. భరణి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను మేనేజ్మెంట్ కోటా అనే కామెంట్స్ పై కూడా భరణి రియాక్ట్ అయ్యారు. 

PREV
15
బిగ్ బాస్ తెలుగు 9

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హంగామా ముగిసింది. కళ్యాణ్ పడాల విజేతగా నిలిచాడు. బుల్లితెర నటి తనూజ రన్నరప్ గా నిలిచింది. అందరి అంచనాలకు తగ్గట్లుగానే కళ్యాణ్, తనూజ ఫైనల్స్ కి చేరారు. అయితే తనూజ విజేత అవుతుంది అని ఆశించిన వారు కూడా ఉన్నారు. అయితే తనూజ అభిమానులకు నిరాశ తప్పలేదు. 

25
ఎలిమినేట్ అయి మళ్ళీ వచ్చిన భరణి 

ఇక ఈ సీజన్ లో బాగా హైలైట్ అయిన కంటెస్టెంట్స్ లో భరణి ఒకరు. భరణి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే అతడిపై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ భరణి గేమ్ కంటే హౌస్ లో బంధాలపైనే ఫోకస్ పెట్టారు. దీనితో భరణి రెండు నెలల లోపే ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత ఆడియన్స్ డిమాండ్ అంటూ మరోసారి భరణిని హౌస్ లోకి తీసుకువచ్చారు. గ్రాండ్ ఫినాలే వీక్ ముందు వరకు భరణి కొనసాగారు. టాప్ 5 కి చేరుకోలేకపోయారు. 

35
భరణికి నాగబాబు సపోర్ట్

ఇదంతా నాగబాబు రెకమండేషన్, మేనేజ్మెంట్ వల్లే జరిగింది అని ప్రచారం జరిగింది. భరణి నాగబాబుకు క్లోజ్ అనే సంగతి తెలిసిందే. నాగబాబు వల్లే భరణి ఫైనల్ వీక్ ముందు వరకు హౌస్ లో ఉన్నారు అంటూ వినిపిస్తున్న విమర్శలపై భరణి స్పందించారు. ఆయన వల్లే భరణికి బిగ్ బాస్ తెలుగు 9 లో ఛాన్స్ వచ్చింది అనే ప్రశ్నలకు భరణి సమాధానం ఇచ్చారు.

45
3వ సీజన్ నుంచే అడుక్కుంటున్నారు 

బిగ్ బాస్ వాళ్ళు సీజన్ 3 నుంచి నన్ను అడుక్కుంటున్నారు. నేను రిజెక్ట్ చేస్తూ వచ్చాను. బిజీగా ఉండడం వల్ల గతంలో బిగ్ బాస్ షోకి అంగీకరించలేకపోయాను. సీజన్ 9కి కూడా అడిగారు. దీనితో బిగ్ బాస్ హౌస్ ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అని అంగీకరించాను. నేను బిగ్ బాస్ షోకి అంగీకారం తెలుపగానే నాగబాబు గారు సపోర్ట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ వాళ్లకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. 

55
అలా అనడం తప్పు 

దానిని సపోర్ట్ అనుకుంటే సపోర్ట్ అవుతుంది లేదా మేనేజ్ అనుకుంటే మేనేజ్మెంట్ అవుతుంది అని భరణి తెలిపారు. నాగబాబు గారి వల్ల నాకు బిగ్ బాస్ అవకాశం రాలేదు. నాకు సపోర్ట్ ఇచ్చారు అంతే. నేను హౌస్ లో ఉంటే ఆయన వచ్చి కామెడీ చేయి, సెంటిమెంట్ చేయి అని చెబుతారా.. అంత తీరిక ఆయనకు ఉందా అని భరణి ప్రశ్నించారు. నాగబాబు గారు ఎమ్మెల్సీ, పైగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయనని ఎన్ని పనులు ఉంటాయి అని భరణి అన్నారు. నాగబాబు గారు మేనేజ్ చేశారు అనే పదమే తప్ప అని భరణి క్లారిటీ ఇచ్చారు. 

Read more Photos on
click me!

Recommended Stories