Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే

Published : Dec 22, 2025, 04:11 PM IST

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ విడుదలై పది రోజులు పూర్తి చేసుకుంది. మరి ఈ మూవీ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఎన్ని కోట్ల లాభం? ఎంత నష్టం అనేది చూస్తే. 

PREV
15
`అఖండ 2` మూవీ కలెక్షన్లు

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ `అఖండ 2` థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే భారీ అంచనాల మధ్య డిసెంబర్‌ 12న విడుదలైన ఈ మూవీ ఆ వసూళ్లని అందుకోవడంలో విఫలమయ్యింది. ఈ సినిమాకి ప్రారంభ షో నుంచే నెగటివ్‌ టాక్‌ వచ్చింది. కాకపోతే మొదటిరోజు మంచి వసూళ్లని రాబట్టింది. ఆ తర్వాత మాత్రం డల్‌ అవుతూ వస్తోంది. ఆడియెన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోతుంది. ఆ ప్రభావం కలెక్షన్లపై పడుతోంది.

25
`అఖండ 2 పది రోజుల కలెక్షన్లు

తాజాగా `అఖండ 2` పది రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ ఆదివారం మంచి వసూళ్లని రాబట్టింది. వీకెండ్‌లో కలెక్షన్లు పుంజుకున్నాయి. అంతకు ముందు కోటికిపైగా రాగా, ఈ శనివారం రెండున్నర కోట్లు, ఆదివారం మూడు కోట్ల వరకు రాబట్టినట్టు సమాచారం. ఇక పది రోజుల్లో ఈ చిత్రం మంచి వసూళ్లని రాబట్టింది. నెగటివ్‌ టాక్‌తోనూ వంద కోట్లు దాటింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.108 కోట్లకుపైగా గ్రాస్‌ని సాధించిందని, రూ.72కోట్ల షేర్‌ని వసూలు చేసిందని టాక్‌.

35
అఖండ 2కి ఎంత నష్టం అంటే?

ఈ క్రమంలో ఇప్పుడు `అఖండ 2` లాభాల్లో ఉందా? నష్టాల్లో ఉందా? అనేది చూస్తే, ఈ మూవీకి రూ.115కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగింది. అంటే ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే ఇంకా రూ.43కోట్ల వరకు రావాలి. ఈ సినిమాకి ఇంకా నాలుగు రోజుల వరకు అవకాశం ఉంది. వీక్‌ డేస్‌ కావడంతో రోజుకి కోటి రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. ఎంత చేసినా ఇది రూ.80కోట్ల వరకు షేర్‌ రాబట్టే ఛాన్స్ ఉంది. అంటే ఓవరాల్‌గా ఈ చిత్రానికి రూ.35-40కోట్ల వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాల సమాచారం.

45
బాలకృష్ణ వరుసగా 5 వంద కోట్ల సినిమాలు

బాలకృష్ణ నటించిన ఐదు సినిమాలు వరుసగా వంద కోట్లు దాటుతున్నాయి. `అఖండ`, `వీరసింహారెడ్డి`, `భగవంత్‌ కేసరి`, `డాకు మహారాజ్‌` చిత్రాలు వంద కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టాయి. ఇప్పుడు ఆ జాబితాలో `అఖండ 2` కూడా చేరింది. ఇలా సీనియర్లలో వరుసగా ఐదు వంద కోట్లు సాధించిన హీరోగా బాలయ్య రికార్డు సృష్టించారు. కాకపోతే రెండు మూడు సినిమాలు ఫెయిల్యూర్‌గా మిగిలాయి. గత చిత్రం `డాకు మహారాజ్‌` కూడా నష్టాలను మిగిల్చింది. ఇప్పుడు `అఖండ 2` కూడా అదే కోవలో చేరబోతుంది.

55
వాయిదా అఖండ 2ని దెబ్బకొట్టిందా?

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన `అఖండ 2` చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. సంయుక్త, పూర్ణ, హర్షాలి కీలక పాత్రలు పోషించారు. 14 రీల్స్ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీఆచంట నిర్మించారు. డిసెంబర్‌ 5న విడుదల కావాల్సిన ఈ మూవీ ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడింది. డిసెంబర్‌ 12న విడుదల చేశారు. వాయిదా పడటం కూడా ఈ మూవీకి పెద్ద మైనస్‌గా మారిందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories