V. V. Vinayak: శీనయ్య మూవీ మిస్ ఫెయిర్ అయ్యింది అక్కడే.. అందుకే ఆపేశాం!

Published : Mar 24, 2026, 10:21 AM IST

V V Vinayak: దాదాపు ఏడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తన సుదీర్ఘ విరామానికి గల కారణాలను వెల్లడించారు. దిల్‌రాజు హీరోగా ప్రారంభమైన 'శీనయ్య' సినిమా ఎందుకు ఆగిపోయింది?  

PREV
15
విరామం వెనుక అసలు కారణం

టాలీవుడ్‌లో 'ఆది', 'లక్ష్మి', 'ఖైదీ నంబర్ 150' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ గత కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. సుమారు ఏడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎదురైన సవాళ్ల గురించి మనసు విప్పారు.

25
ఆరోగ్య సమస్యలు, విరామం:

వినాయక్ తన విరామానికి ప్రధాన కారణం ఆరోగ్య సమస్యలేనని స్పష్టం చేశారు. మధ్యలో దిల్‌రాజు ఆయన్ని హీరోగా పెట్టి 'శీనయ్య' అనే సినిమాను ప్రారంభించారు. ఆ సమయంలో వినాయక్ 'లైపోసెక్షన్' చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆ ప్రక్రియలో కొన్ని అనుకోని పొరపాట్లు జరగడం వల్ల అది వికటించి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసిందని ఆయన వివరించారు.

35
మేజర్ సర్జరీ, కోలుకోవడం:

ఆ మిస్‌ఫైర్ కారణంగా ఆయన ఒక మేజర్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. దాని వల్ల చాలా కాలం పాటు శారీరకంగా ఇబ్బందులు పడ్డారని, కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టిందని చెప్పారు. ఈ కారణం చేతనే 'శీనయ్య' ప్రాజెక్ట్ అటకెక్కిందని, ఆయన ఇండస్ట్రీకి తాత్కాలికంగా దూరమవ్వాల్సి వచ్చిందని వెల్లడించారు.

45
తిరిగి పుంజుకోవడం:

ప్రస్తుతం ఆ గడ్డు కాలం ముగిసిందని, తాను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని వినాయక్ తెలిపారు. త్వరలోనే మళ్లీ మెగా ఫోన్ పట్టి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. మాస్ సినిమాల స్పెషలిస్ట్ అయిన వినాయక్ మళ్లీ ఫామ్‌లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

55
కెరీర్ పీక్స్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్..

ఠాగూర్, అదుర్స్, కృష్ణ,  ఆది, చెన్నకేశవ రెడ్డి లాంటి మాస్ సినిమాలకు వినాయక్ కేరాఫ్ అడ్రస్. బాక్సాఫీస్ దగ్గర వరుస హిట్స్ సాధిస్తూ.. పెద్ద స్టార్లతో సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories