హీరో ఆర్య తన కొత్త సినిమా 'మిస్టర్ ఎక్స్' కోసం గడ్డకట్టే చలిలో, నీటి అడుగున ఏకంగా గంటన్నర పాటు ఫైట్ సీన్‌లో నటించాడు. అభిమానులను ఆశ్చర్యపరిచిన ఆర్య డెడికేషన్ గురించి ఈ గ్యాలరీలో చూద్దాం.
డైరెక్టర్ మను ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'మిస్టర్ ఎక్స్' (Mr X). ఈ సినిమా కోసం హీరో ఆర్య చూపిన డెడికేషన్ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలోని ఓ కీలకమైన, సవాలుతో కూడిన ఫైట్ సీన్‌ను నీటి అడుగున చిత్రీకరించాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది.
25
ఆర్య ఫిట్‌నెస్ సీక్రెట్
సాధారణ నీటిలో నటించడమే కష్టం. అలాంటిది, షూటింగ్ జరిగినప్పుడు అక్కడ వాతావరణం చాలా దారుణంగా ఉంది. దాదాపు 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో, ఎముకలు కొరికే చలిలో ఆర్య నీటిలోకి దిగి నటించాడు. శరీరాన్ని వణికించే ఆ చలిని కూడా లెక్కచేయకుండా, ఊపిరి బిగబట్టి, వణుకును కంట్రోల్ చేసుకుని ఆ ఫైట్ సీన్‌ను పూర్తి చేశాడు. సుమారు గంటన్నర పాటు నీటి అడుగునే ఉండి, షూటింగ్‌కు సహకరించాడు.
35
ఆర్య డెడికేషన్
యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ఆర్య ఎప్పుడూ ప్రత్యేక శిక్షణ తీసుకుంటాడు, ఫిట్‌గా ఉంటాడు. అయినా, ఇంత లోతైన నీటిలో, ఇంత తక్కువ ఉష్ణోగ్రతలో ఊపిరి బిగబట్టి ఫైట్ చేయడం ప్రాణాలకే ప్రమాదం. ఆర్య అద్భుతమైన కష్టాన్ని, వృత్తి పట్ల అతనికున్న అంకితభావాన్ని చూసి డైరెక్టర్ మను ఆనంద్, చిత్ర యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఈ సీన్ స్క్రీన్‌పై ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని వారు నమ్ముతున్నారు.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో 'మిస్టర్ ఎక్స్' సినిమాను రూపొందించారు. ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఆర్య డెడికేషన్ చూసి సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. టెక్నికల్‌గా, యాక్షన్ సీక్వెన్స్‌ల పరంగా ఈ సినిమా ఓ కొత్త మైలురాయిగా నిలుస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
55
కఠినమైన సన్నివేశాల్లో డూప్ లేకుండా ఆర్య
ఇంతటి కఠినమైన సన్నివేశాల్లో డూప్ లేకుండా ఆర్య నటించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రంలో ఆర్యతో పాటు గౌతమ్ కార్తీక్ వంటి పలువురు ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారని తెలిసిందే.