ఇప్పటికే నాలుగు సార్లు పెళ్లి అయ్యింది.. ఇప్పుడు ఐదోసారి.. మ్యారేజ్‌పై అంజలి షాకింగ్‌ కామెంట్స్

Published : Apr 03, 2024, 07:38 PM ISTUpdated : Apr 03, 2024, 08:16 PM IST

హీరోయిన్‌ అంజలిపై ఇప్పటికే చాలా సార్లు మ్యారేజ్‌ రూమర్లు వచ్చాయి. తాజాగా దీనిపై ఆమె స్పందించింది. అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చింది. అద్దె ఇవ్వాలంటూ కామెంట్‌ చేయడం విశేషం.  

PREV
16
ఇప్పటికే నాలుగు సార్లు పెళ్లి అయ్యింది.. ఇప్పుడు ఐదోసారి.. మ్యారేజ్‌పై అంజలి షాకింగ్‌ కామెంట్స్

హీరోయిన్‌ అంజలి టాలీవుడ్‌లో తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. విభిన్నమైన సినిమాల్లో భాగం అవుతూ రాణిస్తుంది. తెలుగు, తమిళంలో ఆమె హీరోయిన్‌గా మెప్పిస్తుంది. ఇటీవల కాలంలో అంజలికి సినిమాలు తగ్గాయి. చాలా అరుదుగా కనిపిస్తుంది. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

26

ఈ నేపథ్యంలో ఆమె మెయిన్‌ లీడ్‌గా చేసిన మూవీ `గీతాంజలి2ః మళ్ళీ వచ్చింది` వస్తుంది. ఈ నెలలోనే ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఇందులో అంజలి పాల్గొంది. సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 
 

36

ఇందులో అంజలి పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఆమెపై మ్యారేజ్‌ రూమర్లు వస్తున్నాయి. త్వరలోనే అంజలి మ్యారేజ్‌ చేసుకోబోతుందనే రూమర్స్ వినిపించిన నేపథ్యంలో రిపోర్టర్‌ ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు. దీనిపై అంజలి స్పందించింది. రిపోర్టర్‌కి అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చింది. 

46

ఇందులో అంజలి చెబుతూ, పెళ్లికి రావాల్సింది నేను, నాకే చెప్పలేదు. ఇప్పటికే నాకు నాలుగు సార్లు పెళ్లి చేశారు. ఇప్పుడు ఐదో సారి మ్యారేజ్‌ చేయడానికి చూస్తున్నారు. తాను కూడా ఇటీవలే ఆ వార్తలు విన్నాను. పెళ్లి అయితే చేసుకుంటాను. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు వచ్చిన వార్తలకు నాకు ఏ సంబంధం లేదు. 

56

అంజలి ఇంకా చెబుతూ, నేను మరో విషయం విన్నాను, ఎవరితోనో లివింగ్‌(సహజీవనం)లో ఉన్నానని, నేనే మా ఇంట్లో ఉండటం లేదు. ఔట్ డోర్‌లో ఉంటున్నాను. ఉంటున్నవాళ్లు ఎవరో నాకు రెంట్‌ ఇచ్చేసి వెళ్లిపోతే బాగుంటుంది, ఈఎంఐలు కట్టుకోవడానిక పనికొస్తుంది అంటూ తనదైన స్టయిల్‌ లో సెటైర్లు పేల్చింది అంజలి. పెళ్లి మ్యాటర్‌ ఇప్పట్లో లేదని తేల్చి చెప్పింది. 
 

66

ఇక సినిమా ఆఫర్లపై చెబుతూ వస్తున్నాయని, కానీ అన్ని చేయడం లేదని, మంచి ఆఫర్లు మాత్రమే చేస్తున్నానని వెల్లడించింది. ప్రస్తుతం `గీతాంజలి మళ్లి వస్తుంది` సినిమాతో ఈ రెండో వారంలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది అంజలి. మరోవైపు `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి`లో ఐటెమ్‌ సాంగ్‌ చేస్తుంది. రామ్‌ చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌`లో కీలక పాత్రలో నటిస్తుంది అంజలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories