సందీప్ వంగా ఆవేశంలో వాగాడు... 200 కోట్లు ఇచ్చినా అతని సినిమాలో నటించను ! షాకింగ్ కామెంట్స్

First Published Jun 13, 2024, 10:10 AM IST

 రూ.100-200 కోట్లు ఇచ్చినా యానిమల్ చిత్రంలో  చేసేవాడినే కాదు. అలాంటివి ఎప్పటికీ చేయనని  తెలిపాడు. 

Sandeep Reddy Vanga Net Worth

సందీప్ రెడ్డి వంగా తన తొలి  సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది. ఇక అర్జున్ రెడ్డి సినిమానే బాలీవుడ్ లో కబీర్ సింగ్ అనే టైటిల్ తో రీమేక్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బాలీవుడ్ లోనూ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా యానిమల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సందీప్ రెడ్డి వంగా బిజీ అయ్యాడు. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగకు మంచి డిమాండ్ ఏర్పడింది .  సందీప్ తో సినిమా చేయడానికి చాలా మంది స్టార్ హీరోలు ఎదురుచూస్తున్నారు. అయితే అదే సమయంలో ఆయన్ను వివాదాలు సైతం చుట్టముట్టడం మానలేదు. 


 ‘కబీర్‌సింగ్‌’ (Kabir Singh)లో కాలేజీ డీన్‌ పాత్ర పోషించిన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అదిల్‌ హుస్సేన్‌...మరో సారి దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కామెంట్స్ చేసారు.  రూ.100-200 కోట్లు ఇచ్చినా యానిమల్ చిత్రంలో  చేసేవాడినే కాదు. అలాంటివి ఎప్పటికీ చేయనని అదిల్‌ తెలిపాడు. మళ్లీ ఎందుకు సందీప్ ని అదిల్ హుస్సేన్ కెలుకుతున్నాడో ఎవరికీ అర్దం కాలేదు.   ఈ వివాదం అదిల్‌ హుస్సేన్‌ ఆ మధ్యంలో  ఓ ఇంటర్వ్యూలో  చేసిన కామెంట్ తో మొదలైంది. ఆయన సందీప్ దర్శకత్వంలో వచ్చిన ‘కబీర్‌ సింగ్‌’ను ఉద్దేశించి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. 


అదిల్ హుస్సేన్ మాట్లాడుతూ...‘‘ఇప్పటివరకూ నా సినీ కెరీర్‌లో ‘ఎందుకు నటించానా?’ అని ఫీలైన చిత్రం ఒక్కటే. అదే ‘కబీర్‌ సింగ్‌’. అందులో కాలేజీ డీన్‌గా వర్క్‌ చేశా. ఎన్నిసార్లు నో చెప్పినా.. ఒకేఒక్క రోజు షూట్‌కు రమ్మని అడిగారు. పెద్ద మొత్తంలో పారితోషికం ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. దాంతో వెళ్లి చెప్పిన సీన్‌ యాక్ట్‌ చేసి వచ్చేశా. ఆ సీన్‌ మంచిగా అనిపించింది. సినిమా కూడా అలాగే ఉంటుందని భావించా. 


యానిమల్ విడుదలయ్యాక ఆ సినిమా చూసి.. ‘‘ఇలాంటి చిత్రంలో ఎందుకు నటించానా?’’ అని ఇబ్బందికరంగా ఫీలయ్యా. స్నేహితుడితో కలిసి సినిమా చూడ్డానికి వెళ్లిన నేను మధ్యలోనే బయటకు వచ్చేశా. ఆ సినిమా చూడమని నా భార్యకు కూడా చెప్పలేదు. ఒకవేళ ఆమె కనుక చూసి ఉంటే నన్ను తిట్టేది’’ అని చెప్పారు.
 


ఆ కామెంట్స్  సందీప్‌ దృష్టికి వచ్చాయి. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘మీరు గొప్పగా భావించి నటించిన 30 చిత్రాలతో రాని గుర్తింపు.. ఎందుకు నటించానా? అని ఫీలవుతున్న ఈ ఒక్క బ్లాక్‌బస్టర్‌తో మీ సొంతమైంది. నటనపై అభిరుచి కంటే దురాశ ఎక్కువగా ఉన్న మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు ఇప్పుడు బాధ పడుతున్నా. ఇకపై మీరంత సిగ్గుపడకుండా ఉండేలా నేను చేస్తా. ఆ సినిమాలో మీ స్థానాన్ని ఏఐ సాయంతో ఫిల్‌ చేస్తా’’ అని ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో  అదిల్‌.. సందీప్‌ వ్యాఖ్యలపై స్పందించాడు. 'ఆయనేమైనా తైవాన్‌ డైరెక్టర్‌ ఆంగ్‌ లీ కన్నా ఫేమస్‌ అనుకుంటున్నాడా? ఆయన అంతలా ఊహించుకుంటే నేనేం చేయలేను. కబీర్‌ సింగ్‌ కలెక్షన్స్‌ నాకంతగా తెలీదు కానీ, ఆంగ్‌ లీ తెరకెక్కించిన లైఫ్‌ ఆఫ్‌ పై మూవీ దాదాపు 5 వేల కోట్లపైన రాబట్టింది. ఈ లెక్కల్ని ఆయన సాధిస్తాడని నేననుకోవడం లేదు. 

Sandeep Reddy Vanga


అతడు ఆచితూచి మాట్లాడితే బాగుండేది. ఏదో ఆవేశంలో వాగేశాడు. దాన్ని నేను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు' వ్యాఖ్యానించాడు. యానిమల్‌ సినిమాలో ఏదైనా పాత్ర ఆఫర్‌ చేస్తే చేసేవారా? అన్న ప్రశ్నకు.. లేదని బదులిచ్చాడు. రూ.100-200 కోట్లు ఇచ్చినా చేసేవాడినే కాదు. అలాంటివి ఎప్పటికీ చేయనని అదిల్‌ తెలిపాడు.   అదిల్‌ హుస్సేన్‌.. 2012లో వచ్చిన లైఫ్‌ ఆఫ్‌ పై సినిమాలో ఓ పాత్రలో నటించాడు.


షాహిద్‌ కపూర్‌ - కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కబీర్‌ సింగ్‌’. తెలుగులో సూపర్‌హిట్‌ అందుకున్న ‘అర్జున్‌రెడ్డి’కి రీమేక్‌గా ఇది సిద్ధమైంది. నటీనటులకే కాకుండా దర్శకుడికీ ఈ చిత్రం ఘన విజయాన్ని అందించింది. ‘ఇష్కియా’, ‘ఏజెంట్‌ వినోద్‌’, ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’, ‘లైఫ్‌ ఆఫ్‌ పై’, ‘జడ్‌ ప్లస్‌’, ‘ఫోర్స్‌ 2’, ‘కమాండో 2’, ‘రోబో 2.0’, ‘గుడ్‌న్యూస్‌’ వంటి చిత్రాల్లో అదిల్‌ యాక్ట్‌ చేశారు.

Sandeep Reddy Vanga


 బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్ నటించిన సూపర్‌హిట్‌ మూవీ 'యానిమల్‌' ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సినిమా రీసెంట్ గా ఓటిటి లో రిలీజ్ అయ్యాక మరింతగా సందీప్ పై సోషల్ మీడియాలో దాడి మొదలైంది. సందీప్‌ రెండ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్‌తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూసారు. 

sandeep reddy vanga


గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసారు. జనవరి 26 నుంచి యానిమల్‌ స్ట్రీమింగ్‌ అయ్యింది.   ఇప్పటికే ఇలాంటి చిత్రాల వల్ల సమాజానికి తీవ్రస్థాయిలో ముప్పు తప్పదని మహిళా ఎంపీలు అభిప్రాయపడ్డారు. స్త్రీ విద్వేష సినిమాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

 ‘యానిమల్‌’ సినిమాపై బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు స్పందించారు. ఈ సినిమా స్త్రీ విద్వేషంతో నిండి ఉందని వెల్లడించింది. ‘బాహుబలి-2’, ‘కబీర్ సింగ్’ సినిమాలు సైతం స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. ‘బాహుబలి’ సినిమా ప్రారంభంలో స్త్రీ పాత్రలను బలంగా చూపించినా, చివరకు శృంగార బొమ్మలా చూపించే ప్రయత్నం చేశారని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేకపోగా, కీడు కలిగించే అవకాశం ఉందని వెల్లడించింది.
 

Sandeep Reddy Vanga

దీనికి కౌంటర్ గా సందీప్ మాట్లాడుతూ...“నా సినిమాల గురించి విమర్శించే ఆమెను ఓ విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మీరు ముందుగా అమీర్ ఖాన్ నటించిన ‘దిల్’ సినిమా చూడండి. ఈ సినిమాలో ఆయన దాదాపు అమ్మాయిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆ అమ్మాయిదే తప్పు అనేలా చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ, అదే అమ్మాయి చివరకు అతడితో ప్రేమలో పడుతుంది. ఈ సినిమాను ఎలా అర్థం చేసుకోవాలి? ముందు ఇలాంటి సినిమాల గురించి మాట్లాడిన తర్వాత మా సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. గతాన్ని మరిచి విమర్శలు చేయడం మంచిది కాదని గుర్తుంచుకుంటే బాగుంటుంది” అని సందీప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sandeep Reddy Vanga


యానిమల్‌ చిత్రాన్ని భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని నిర్మించారు.  టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల అయ్యింది. మితిమీరిన ర‌క్త‌పాతం, అస‌భ్యక‌ర‌మైన కొన్ని హావ‌భావాలు, విన‌లేని డైలాగులు ఇబ్బంది పెడ‌తాయి. ఇవన్నీ ప్రక్కన పెడితే యూత్ కు పిచ్చ పిచ్చగా ఎక్కేసింది.
 

 ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సందీప్ రెడ్డి వంగా బిజీ అయ్యాడు. ప్రభాస్ సినిమా గురించి మాట్లాడుతూ..   ఈ సినిమా తొలిరోజే 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అన్నాడు. దాంతో స్పిరిట్ సినిమా ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Latest Videos

click me!