రాజమౌళి, సుకుమార్.. తమ ఇమాజినేషన్ కి పదును పెడుతూ ఇండియన్ సినిమాలో భాషా హద్దులని చెరిపేస్తున్న దర్శకులు వీరిద్దరు. రాజమౌళి ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా కీర్తి పొందుతున్నారు.
రాజమౌళి, సుకుమార్.. తమ ఇమాజినేషన్ కి పదును పెడుతూ ఇండియన్ సినిమాలో భాషా హద్దులని చెరిపేస్తున్న దర్శకులు వీరిద్దరు. రాజమౌళి ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా కీర్తి పొందుతున్నారు. సుకుమార్ ఇటీవలే పుష్ప చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారు.
26
ఇప్పుడు అందరి చూపు పుష్ప 2పై ఉంది. పుష్ప మొదటి భాగం హిందీలో భారీ విజయం సాధించడంతో రెండవ భాగం ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి మొదలైంది. అందుతున్న సమాచారం మేరకు పుష్ప 2 స్క్రిప్ట్ లో మార్పులు చేసి మరింత భారీగా మారుస్తున్నారట. బడ్జెట్ కూడా పెంచుతున్నట్లు తెలుస్తోంది.
36
ఇక సుకుమార్ రెమ్యునరేషన్ కి సంబదించిన క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. పుష్ప 2 చిత్రానికి సుక్కు రెమ్యునరేషన్ భారీగా ఉండబోతున్నట్లు టాక్. సుక్కు ఏకంగా రూ 40 కోట్లు పార్ట్ 2 కోసం ఛార్జ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక జరిగితే టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత సుకుమారే అని చెప్పాలి.
46
Rajamouli
రాజమౌళి సినిమాలో వాటా, రెమ్యునరేషన్ రూపంలో దాదాపు 100 కోట్ల వరకు అందుకుంటారు. రాజమౌళి అంత రెమ్యునరేషన్ అందుకోవడంలో ఆశ్చర్యం లేదు.కానీ సుకుమార్ రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికం 30 నుంచి 50 కోట్ల వరకు ఉంటుంది.
56
ఇప్పుడు సుకుమార్ ఆ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటుండడంతో అంతా షాక్ అవుతున్నారు. పుష్ప 2తో సుకుమార్ వండర్స్ క్రియేట్ చేస్తే మరో స్టార్ పాన్ ఇండియా డైరెక్టర్ తెలుగు నుంచి రెడీ అయినట్లే.
66
ఇక పుష్ప 2 అప్డేట్ విషయానికి వస్తే త్వరలోనే సుకుమార్ అండ్ టీమ్ లొకేషన్స్ వేట మొదలు పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లొకేషన్స్ ఫైనల్ అయిన వెంటనే పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లనుంది.