లక్ష్యం, లౌక్యం, రామరామ కృష్ణ కృష్ణ లాంటి చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా శ్రీవాస్ కొనసాగుతున్నారు. ప్రస్తుతం శ్రీవాస్ హీరో గోపీచంద్ తో రామబాణం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మే 5న ఈ చిత్ర చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కమర్షియల్ చిత్రాలని తెరకెక్కించడంలో శ్రీవాస్ ది ప్రత్యేకమైన శైలి.