తెలుగులో అఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ఈసినిమాతో టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వచ్చి పడ్డాయి. అప్పటి నుంచి ఎక్కువగాి మలయాళం, తెలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది బ్యూటీ. లాస్ట్ ఇయర్ వరుసగా నాలుగు తెలుగు సినిమాలు రిలీజ్ చేసింది. కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన అనుపమ బటర్ ఫ్లై సినిమాతో ఓటీటీలో కూడా మెప్పించింది.