ఆ మధ్య అంతా ఇండియన్ 2, ఇతర పనుల్లో బిజీగా ఉన్న శంకర్ ఇప్పుడు ఫోకస్ పూర్తిగా గేమ్ ఛేంజర్ పై పెట్టారని చెప్పాలి.రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్”. భారీ ఎక్సపెక్టేషన్స్ నెలకొల్పుకున్న ఈ సినిమా రిలీజ్ అండ్ అప్డేట్స్ కోసం అయితే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి శంకర్ మీదే భారం వేసిన మెగా అభిమానులు తాను ఈ సినిమాతో మళ్ళీ మాస్ కం బ్యాక్ కొట్టాలని ఆశిస్తున్నారు. ఈ చిత్రంపై టీమ్ ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారనే చెప్పాలి. అయితే అదే సమయంలో ఈ సినిమా విషయంలో చాలా వేస్టేజ్ జరిగిందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది.
గత కొద్ది కాలంగా భారతీయుుడు 2 ప దృష్టి పెట్టిన శంకర్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ ని చెక్కుతున్నారు. లేటెస్ట్ గా తన ఎక్స్ ఖాతా హెడర్ ఫోటోని మొన్న గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్ పిక్ రామ్ చరణ్ తో అప్డేట్ చేసుకున్నారు. దీనితో ఇక శంకర్ ఫోకస్ అంతా గేమ్ ఛేంజర్ కి షిఫ్ట్ అయ్యింది అని వరుస అప్డేట్స్ ఉంటాయని చరణ్ అండ్ మెగా అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ భారీ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా ఈ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
game changer
గేమ్ ఛేంజర్ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ 20 న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్, డిఫరెంట్ కథతో రాబోతున్న సినిమా కావడంతో శంకర్ బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గట్లేదు. గతంలో వచ్చిన సినిమాలకు, ఈ సినిమాకు భారీ వ్యత్యాసం ఉందని తెలుస్తుంది. సరికొత్త లుక్ లో చెర్రీ కనిపిస్తున్నాడు.
‘ గేమ్ ఛేంజర్ ‘ లో తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో దూసుకుపోతున్నాడు చెర్రీ. ఇక ఈ సినిమాతో ఇలాగూన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని మరో సారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ కోసమే మేకర్స్ ఏకంగా మూడు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
game changer
‘గేమ్ ఛేంజర్’తమ బ్యానర్ లో 50 వ సినిమా కాబట్టి.. దిల్ రాజు గ్రాండ్ గా ఈ సినిమాని చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సినిమాకి అయిన బడ్జెట్ రూ.370 కోట్లు అని తెలుస్తుంది. ఇందులో వేస్టేజీ రూ.100 కోట్లట. అంటే సినిమా (Game Changer) కోసం శంకర్ షూట్ చేసిన ఫుటేజీలో చాలా వరకు డస్ట్ బిన్ లో పడేశాడట శంకర్. దాని వ్యాల్యూ రూ.100 కోట్లకి చేరినట్టు చెప్పుకుంటున్నారు. అందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.
బిజినెస్ విషయానికి వస్తే..
అయితే ఇప్పటిదాకా జరగండి అనే పాట మినహా ఎటువంటి అప్‌డేట్‌ను విడుదల చేయలేదు. దానికి తోడు శంకర్ డైరక్ట్ చేయగా లేటెస్ట్ గా రిలీజైన భారతీయుడు 2 పెద్ద డిజాస్టర్‌గా అయ్యింది. ఈ గేమ్ ఛేంజర్ సినిమా బిజినెస్ పై ఆ ఇంపాక్ట్ పడుతోందని సమాచారం. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు గేమ్ ఛేంజర్ నుంచి తెలుగు డిస్ట్రిబ్యూటర్లు వెనక్కి తగ్గుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
చాలా కాలం నుంచి షూటింగ్ జరగటం, ఎలాంటి అప్‌డేట్ విడుదల కాకపోవటంతో , ఈ చిత్రం హైప్, బజ్ తగ్గటం మొదలైంది. డిస్ట్రిబ్యూటర్స్ వెనక్కి తగ్గుతున్నారని తెలుస్తోంది
డిస్ట్రిబ్యూటర్స్ లో ఉత్సాహం తగ్గటానికి మరో ప్రధాన కారణం. నిర్మాత దిల్ రాజు భారీ చెప్తున్న రేట్లు అని సమాచారం. ఏపీ నుంచి దిల్ రాజు 90 కోట్ల బిజినెస్ ఎక్సపెక్ట్ చేసి అందుకు తగ్గ రేట్లు చెప్తున్నారు. రీసెంట్ గా విడుదలైన బ్లాక్ బస్టర్ కల్కి 2898 AD ఏపీ నుండి 90 కోట్లు వసూలు చేసింది. ఆ లెక్కలు చూసే దిల్ రాజు కల్కి 2898 AD సక్సెస్ నంబర్‌ని ఈ సినిమాకు చెప్తున్నట్లు గా తెలుస్తోంది.
ఈ క్రమంలో 90 కోట్లకు సరపడ రిస్క్ తీసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా లేరని అంటున్నారు. దిల్ రాజుకు నమ్మకమైన డిస్ట్రిబ్యూటర్ బ్యాచ్ ఉంది, కానీ వాళ్లు సైతం నెగోషియేట్ చేస్తున్నారట. ఇవన్నీ ఇలా ఉంటే ఈ సినిమా ప్యాన్ ఇండియా రిలీజ్ కు ప్లాన్ చేసినా ఇప్పటిదాకా ఇతర భాషలలో ప్రమోషన్స్ లేవు.
దాంతో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ను, బయ్యర్లను ఆకర్షించలేదు. కొందరు ఈ చిత్రం రైట్స్ అడుగుతున్నా దిల్ రాజు కోట్ చేసిన రేట్లకు బిజినెస్ జరగకపోవచ్చు అంటున్నారు. నిర్మాతగా దిల్ రాజు అనుకున్న రేట్ రావాలంటే కనీసం ఇప్పుడైనా చిత్రం నుండి కొంత ఎఫెక్టివ్ కంటెంట్‌ని టీమ్ అప్‌డేట్‌లుగా విడుదల చేయాల్సిన అవసరం ఉంది.
రఫ్ కట్ చూసిన తర్వాత దర్శకుడు శంకర్..కొన్ని పోర్షన్స్ రీషూట్ చేయాలని దిల్ రాజుకు చెప్పారట. ఆ రీషూట్ కోసం రామ్ చరణ్ వి నాలుగు నుంచి ఐదు రోజులు డేట్స్ కావాలి. రామ్ చరణ్ ని ఎలాగోలా ఒప్పించి తీసుకువద్దామన్నా శంకర్ సినిమా అంటే భారీ గా ఉంటాయి అన్నీ,వందల్లో క్రూ మెంబర్స్, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ లు కావాలి. వీళ్లందరి డేట్స్ పట్టుకోవటం, మళ్లీ ఖర్చు పెట్టడం నిర్మాతగా దిల్ రాజుకు పెద్ద ఛాలెంజ్.
అలాగే ఎగస్ట్రా ఫైనాన్సియల్ బర్డెన్. మరో ప్రక్క రామ్ చరణ్ ..‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు దిల్ రాజు ...రామ్ చరణ్ ని కలిసి ఒప్పించి డేట్స్ తీసుకోవాలి. ఇలా దిల్ రాజుకు ఈ లాస్ట్ మినిట్ ట్విస్ట్ లాంటిది ఊహించనది అయ్యిందంటున్నారు. అయితే ఇలాంటి భారీ సినిమాలకు రీషూట్ లు తప్పనిసరి అనేది నిజం.