Ram Gopal Varma
ఒకప్పుడు దేశం మెచ్చిన సినిమాలు చేసిన వర్మ ఇప్పుడు కాంట్రవర్సీ, అడల్ట్ కంటెంట్ చిత్రాలు చేస్తున్నారు. నైనా గంగూలీ, అప్సరా రాణి ఈ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా అప్సర రాణి తరచుగా వర్మతో కనిపిస్తుంది.
ram gopal varma
బిగ్ బాస్ బ్యూటీస్ అషురెడ్డి, అరియనా గ్లోరి, ఇనయ సుల్తానా కూడా వర్మతో సన్నిహితంగా ఉంటారు. అషురెడ్డి, అరియనా ఆయనతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేశారు. అషురెడ్డి రెండు ఇంటర్వ్యూల్లో పాల్గొనగా, అరియనా గ్లోరీ ఒక ఇంటర్వ్యూ చేసింది.
Ram Gopal Varma
బోల్డ్ ఇంటర్వ్యూల్లో వర్మ వారి బాడీల మీద పచ్చి కామెంట్స్ చేశాడు. ఈ ఇంటర్వ్యూలు దుమారం రేపాయి. తాజాగా వర్మ మరో అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడు. వీకెండ్ మందేస్తూ ఆ అమ్మాయితో ఉన్న ఫోటోలు షేర్ చేశాడు. మీరు కుళ్ళుకుంటే ఇంకో రెండు పెగ్గులు వేస్తా... అని క్యాప్షన్ పెట్టాడు.
వర్మ పక్కన ఉన్న ఈ కొత్త అమ్మాయి ఎవరనే సందేహాలు మొదలయ్యాయి. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి వర్మకు పరిచయమైంది. ఆమె అప్పుడప్పుడు వర్మను కలుస్తుంది. ఆమెతోనే వర్మ వీకెండ్ పార్టీ చేసుకున్నాడు. ఈ క్రమంలో వర్మకు మరో కొత్త అమ్మాయి దొరికిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Ram Gopal Varma
మరోవైపు వర్మ తెరకెక్కించిన వ్యూహం న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుంది. వ్యూహం విడుదలకు బ్రేక్ పడింది. ఏపీ సీఎం వై ఎస్ జగన్ జీవితం ఆధారంగా వ్యూహం తెరకెక్కిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియా పోస్ట్స్ తో వర్మను ఆకర్షించిన మళయాళ బ్యూటీ శ్రీలక్ష్మి సతీష్ ని హీరోయిన్ చేశాడు. ఆమెతో శారీ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నాడు. దర్శకుడు అగస్త్య శారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.