Sarakaru Vaari Paata: ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ డైలాగ్ అందుకే పెట్టాను.. మహేష్ కూడా అభ్యంతరం చెప్పలేదు 

Published : May 06, 2022, 07:35 PM ISTUpdated : May 06, 2022, 10:08 PM IST

సర్కారు వారి పాట ట్రైలర్ కట్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. క్లాస్ మాస్ అంశాల కలబోసి మహేష్ ని పరుశురామ్ ప్రజెంట్ చేసిన తీరు అబ్బురపరిచింది. అదే సమయంలో మహేష్ చెప్పిన ఓ డైలాగ్ పెద్ద రాజకీయ చర్చకు తెరదీసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫేమస్ నినాదం మహేష్ నోటి నుండి రావడం సంచలనం రేపింది.

PREV
17
Sarakaru Vaari Paata: ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ డైలాగ్ అందుకే పెట్టాను.. మహేష్ కూడా అభ్యంతరం చెప్పలేదు 
Sarakaru vaari paata - Mahesh babu

రెండున్నర నిమిషాల సర్కారు వారి పాట ట్రైలర్ (Sarkaru Vaari Paata trailer) దుమ్మురేపింది. మహేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ అన్న సంకేతాలిచ్చింది. ట్రైలర్ లో మహేష్ హీరోయిన్ కీర్తి సురేష్ తో ''నేను ఉన్నాను నేను విన్నాను'' అంటూ హామీ ఇస్తాడు. ఈ డైలాగ్ చర్చనీయాంశమైంది. సీఎం జగన్ పాదయాత్ర సమయంలో ఈ నినాదంతో ముందుకెళ్లారు. ప్రజల్లో జగన్ (CM YS Jagan)పట్ల నమ్మకాన్ని రగిల్చిన ఈ డైలాగ్ ఆయనకు అధికారం కట్టబెట్టింది. 
 

27
Sarakaru vaari paata - Mahesh babu

అయితే మహేష్ (Mahesh Babu)ఈ డైలాగ్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది అందరి అనుమానం. దీనిని జనాలు రెండు రకాలుగా తీసుకున్నారు. సీఎం జగన్ ని వ్యతిరేకించేవారు అది సెటైర్ అంటూ కథనాలు వల్లించారు. సినిమా టికెట్స్ ధరల విషయంలో సీఎం జగన్ స్టార్ హీరోల ఆగ్రహానికి గురయ్యారని, ఆ క్రమంలో మహేష్ ఆయనపై సెటైర్ పేల్చారన్నారు.

37


జగన్ అభిమానులు దీన్ని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకున్నారు. ఎప్పటి నుండో వైఎస్ కుటుంబానికి కృష్ణ, మహేష్ సన్నిహితులు. ఈ క్రమంలో సీఎం జగన్ సుపరిపాలనను కొనియాడుతూ మహేష్ తన సినిమాలో జగన్ నినాదం తన నోటి నుండి డైలాగ్ రూపంలో పలికాడంటూ ప్రచారం చేశారు. ఐతే జగన్ పై ఇది సెటైరా? పొగడ్తా? అనేది సినిమా విడుదల తర్వాత తెలుస్తుందని ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు. 

47

కాగా ఈ విషయంపై దర్శకుడు పరుశురామ్ (Parashuram) స్వయంగా స్పందించారు. సీఎం జగన్ ఫేమస్ నినాదం డైలాగ్ రూపంలో రాయడం వెనుక కారణం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... “నాకు దివంగత నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అంటే చాలా ఇష్టం. ఆయ‌న‌కు హీరో వర్షిప్ ఉండేది. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన `నేను ఉన్నాను.. నేను విన్నాను` అనే పొలిటిక‌ల్ డైలాగ్ నాకు చాలా ఇష్టం. చాలా అర్థం ఉంది అందులో. ఎంత పెద్ద భావాన్ని.. ఇంత చిన్న ముక్క‌లో భ‌లే చెప్పారు అనిపించింది. అలాంటి సంద‌ర్భం `స‌ర్కారు వారి పాట‌`లో ఒక‌టి వ‌చ్చింది. క‌థానాయిక కీర్తి సురేష్‌కి అలాంటి భ‌రోసానే హీరో ఇవ్వాల్సివ‌చ్చిన‌ప్పుడు ఈ డైలాగ్ ప‌ర్‌ఫెక్ట్ గా స‌రిపోతుంద‌నిపించింది. స్క్రిప్టు రాస్తున్న‌ప్పుడే ఈ డైలాగ్ ఉంది. మ‌హేష్ కూడా ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేదు. ఎలాంటి డిస్క‌ర్ష‌న్ లేకుండా.. సెట్లో ఈ డైలాగ్ ఓకే అయిపోయింది“ అని చెప్పుకొచ్చారు

57

సో.. మహేష్ చెప్పిన ఈ డైలాగ్ సెటైర్ కాదు, జగన్ నినాదం వెనుక విశేషమైన అర్థం వచ్చే సన్నివేశం సర్కారు వారి పాట చిత్రంలో ఉందని, అందుకే ఆ డైలాగ్ రాశానని పరుశురామ్ క్లారిటీ ఇచ్చారు. కష్టాల్లో ఉన్న కీర్తి (Keerthy Suresh)మహేష్ ని అప్పుడగడం ఆయన డబ్బులు ఇస్తూ ఈ డైలాగ్ చెప్పడం మనం ట్రైలర్ లో చూడవచ్చు. 
 

67

ఇక దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర మూవీలో ఈ డైలాగ్ ఉంది.వైస్సాఆర్ రోల్ చేసిన మమ్ముట్టి పాదయాత్రలో పేదల కష్టాలు వింటూ నేను విన్నాను, ఉన్నాను అంటూ చెబుతాడు. కావున పొలిటికల్ హీరో రాజశేఖర్ రెడ్డి చెప్పిన ఈ మాటను ఆయన ఆరాధ్యుడిగా ఈ సినిమాకు రాసుకున్నానని పరుశరామ్ చెప్పారు. 
 

77

కాగా మూవీ విడుదలకు వారం సమయం మాత్రమే ఉంది. పరుశురాం, కీర్తి సురేష్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. విదేశీ టూర్ లో ఉన్న మహేష్ ఇండియా వచ్చిన వెంటనే ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొననున్నారు. మే 7న యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది.

click me!

Recommended Stories