`స్పై` బ్యాచ్‌తో సినిమా.. ప్రకటించిన శివాజీ.. టైటిల్‌ కూడా ఖరారు.. షూటింగ్‌ ఎప్పుడంటే?

Published : Dec 27, 2023, 01:46 PM IST

 బిగ్‌ బాస్‌ 7 విన్నర్‌  ప్రశాంత్‌ కి కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయని  భోలే తెలిపారు. అయితే వీరి గురువు శివాజీ ఏకంగా సినిమాని ప్రకటించారు. తమ స్పై బ్యాచ్‌తో సినిమా చేయబోతున్నట్టు తెలిపారు.  

PREV
16
`స్పై` బ్యాచ్‌తో సినిమా.. ప్రకటించిన శివాజీ.. టైటిల్‌ కూడా ఖరారు.. షూటింగ్‌ ఎప్పుడంటే?

బిగ్‌ బాస్‌ తెలుగు 7 వ సీజన్‌ ఈసారి బాగా పాపులర్‌ అయ్యింది. అంతేకాదు చాలా వివాదంగానూ మారింది. షో అంతా అయిపోయాక దాన్ని వివాదాలు వెంటాడాయి. ఈ సీజన్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ టైటిల్‌ గెలిచి బయటకు వచ్చాక అభిమానులు చేసిన అల్లర్ల కారణంగా పెద్ద రచ్చ అయ్యింది. దీని కారణంగా ప్రశాంత్‌ జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. రైతు బిడ్డ బిగ్‌ బాస్‌ విన్నర్‌ అయ్యాడనే సంతోషం, సెలబ్రేషన్‌ లేకుండా వివాదాలతో ఇబ్బందుల్లో పడ్డాడు ప్రశాంత్‌. కొందరు కావాలని చేశారనే ప్రచారం జరుగుతుంది. మొత్తంగా దాన్నుంచి బయటపడుతున్నాడు ప్రశాంత్‌. 
 

26

మరోవైపు హౌజ్‌లో ప్రశాంత్‌కి మెంటర్‌గా, గైడ్‌గా వ్యహరించాడు శివాజీ. చాలా విషయాలు నేర్పించాడు. ఎలా ఉండాలో చెప్పాడు. ఆటలో సపోర్ట్ చేశాడు. గొడవలో అండగా నిలిచాడు. మొత్తంగా షో అయిపోయేంత వరకు ప్రశాంత్‌కి బ్యాక్‌ బోన్‌లా నిలిచాడు. టైటిల్‌ గెలవడంలో పరోక్షంగా శివాజీ ఓ కారణంగానూ నిలిచాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వీరిద్దరితోపాటు యావర్‌ కూడా మంచి స్నేహాన్ని కొనసాగించారు.ఈ ముగ్గురు హౌజ్‌లో స్పై బ్యాచ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ అదే ట్యాగ్‌ని కంటిన్యూ చేస్తున్నారు.  
 

36

ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ విన్నర్‌కి ఇటీవల సినిమా ఆఫర్లు వస్తున్నాయి. గతంలో వీజే సన్నీకి మంచి ఆఫర్లు వచ్చాయి. అంతకు ముందు సోహైల్‌ ఆఫర్లు అందుకున్నాడు. హీరోగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ప్రశాంత్‌ కి కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది. ఈ విషయాన్ని భోలే తెలిపారు. అయితే వీరి గురువు శివాజీ ఏకంగా సినిమాని ప్రకటించారు. తమ స్పై బ్యాచ్‌తో సినిమా చేయబోతున్నట్టు తెలిపారు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. 
 

46

హౌజ్‌లో వంద రోజులు వారితో ట్రావెల్‌ చేశానని, ఎంతో బాండింగ్‌ ఏర్పడిందని, తన సోల్‌ మేట్స్ లా మారిపోయారని, వారికోసం ఏదో ఒకటి చేయాలనిపించిందని, అందుకే సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు శివాజీ. అలా స్పై బ్యాచ్‌తో సినిమా చేయాలనుకుంటున్నట్టు తెలిపారు శివాజీ. ఇటీవలే ఆ ఆలోచన వచ్చిందట. ఓ లైన్‌ కూడా అనుకున్నారట. దర్శకుడితో డిస్కషన్‌ కూడా జరిగిందని తెలిపారు. 
 

56

అయితే అది షార్ట్ మూవీగా చేయాలనుకుంటున్నారట. హాలీవుడ్‌ తరహా సినిమాగా వస్తుందా? ఎలా వస్తుందో తెలియదు, కానీ సినిమా చేయబోతున్నట్టు తెలిపారు. రెండు మూడు నెలల్లోనే ప్రకటన వస్తుందని, సెట్‌ పైకి తీసుకెళ్తామని తెలిపారు. అంతేకాదు ఈ సినిమాకి టైటిల్‌ కూడా ప్రకటించాడు. `స్పై` బ్యాచ్‌గానే పాపులర్ అయ్యాం కాబట్టి అదే టైటిల్‌ అని తేల్చేశాడు. అయితే సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్నానని, అది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి అని, మళ్లీ తీయకపోతే తనని అడగొద్దని వార్నింగ్‌ కూడా ఇచ్చాడు శివాజీ.
 

66

ఇక పల్లవి ప్రశాంత్‌ `రైతు బిడ్డ` ట్యాగ్‌ వాడుకోవడంపై వచ్చే విమర్శలపై స్పందిస్తూ, రైతు బిడ్డ.. రైతు బిడ్డ అని చెప్పుకోవడంలో తప్పేముంది, మిగిలిన వాళ్లంతా తమ ప్రొఫేషన్స్ ని చెబుతున్నారు, అలా తన వృత్తిని చెప్పుకున్నాడు, అందులో తప్పేం ఉంది. ఎందుకు దాన్ని వివాదం చేస్తున్నారు, ట్రోల్‌ చేస్తున్నారని అన్నారు. కొందరు పడని వాళ్లు, అసూయతో తట్టుకోలేని వాళ్లు మాట్లాడే మాటలు ఇవి అన్నారు. తను నిజాయితీగా ఆట ఆడాడని, అదే అతన్ని విన్నర్‌ని చేసిందని, తాను గెలిపించాననేదాంట్లో నిజం లేదన్నారు. ప్రశాంత్‌లో మున్ముందు మంచి స్థానానికి వెళ్తాడని లైఫ్‌లో చాలా సాధిస్తాడని తెలిపారు శివాజీ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories