పెళ్లి వద్దనుకున్నా కానీ రమ్యకృష్ణ నా లైఫ్ లోకి వచ్చింది... ప్రైవేట్ విషయాలపై స్పందించిన డైరెక్టర్ కృష్ణవంశీ!

Published : Jul 17, 2022, 01:42 PM IST

డైరెక్టర్స్ అనేక మంది ఉంటారు వారిలో కొందరే గుర్తుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమపై ముద్ర వేసినవారిలో కృష్ణవంశీ ఒకరు. ఆయనది ప్రత్యేకమైన శైలి. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ వెండితెరపై చూపించడంలో ఆయన తర్వాతే. క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీ కెరీర్ లో అనేక హిట్ చిత్రాలు తెరకెక్కించారు.   

PREV
15
పెళ్లి వద్దనుకున్నా కానీ రమ్యకృష్ణ నా లైఫ్ లోకి వచ్చింది... ప్రైవేట్ విషయాలపై స్పందించిన డైరెక్టర్ కృష్ణవంశీ!

కృష్ణ వంశీ డెబ్యూ మూవీ గులాబీ. గడ్డం చక్రవర్తి, మహేశ్వరి హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ ఇంటెన్స్ లవ్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన మూవీ గులాబీ. శ్రీలేఖ అందించిన సాంగ్స్ కూడా విపరీతంగా మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకున్నాయి.

25


గులాబీ మూవీ తర్వాత సింధూరం, నిన్నే పెళ్లాడతా వంటి హిట్స్ కృష్ణ వంశీ నుండి వచ్చాయి. కెరీర్లో కృష్ణ వంశీ తెరకెక్కించింది తక్కువ చిత్రాలే అయినా ఓ బ్రాండ్ మార్క్ క్రియేట్ చేశారు. జనరేషన్స్ మారే కొద్దీ కృష్ణ వంశీ చిత్రాలు అవుట్ డేటెడ్ అయ్యాయి. ఖడ్గం వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కృష్ణ వంశీ కెరీర్ మెల్లగా నెమ్మదించింది. వరుస ప్లాప్స్ నేపథ్యంలో ఆయనకు అవకాశాలు తగ్గాయి. 

35

అయితే టాలీవుడ్ సూపర్ లేడీ రమ్య కృష్ణను ఆయన చాలా క్రితమే వివాహం చేసుకున్నారు. 2003 లో వీరి వివాహం జరుగగా ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. హైదరాబాద్ లో కృష్ణ వంశీ సెటిల్ కాగా చెన్నైలో రమ్య కృష్ణ ఉంటున్నారు. ఈ క్రమంలో కృష్ణ వంశీ, రమ్య కృష్ణ విడిపోయారని చాలా కాలంగా పుకారు ఉంది.

45


దీనిపై తాజాగా కృష్ణ వంశీ వివరణ ఇచ్చారు.. ఆయన మాట్లాడుతూ నాకు ఫ్యామిలీ లైఫ్ పట్ల అంత ఆసక్తి లేదు. అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. నా ఆలోచనలకు, లక్ష్యాలకు పెళ్లి అడ్డుకాకూడని భావించాను. అయితే అనుకోకుండా రమ్యకృష్ణను వివాహం చేసుకోవాల్సి వచ్చింది. 

55


ఆమె నా కెరీర్ కి మద్దతు ఇచ్చింది. నన్ను అర్థం చేసుకొని ఫ్రీడమ్ ఇచ్చారు. అయితే కొన్ని మీడియా సంస్థలు మా మధ్య విబేధాలు ఉన్నట్లు కథనాలు ప్రచురించాయి. ఈ వార్తలను రమ్యకృష్ణ నేను సిల్లీగా తీసుకుంటాం. వాటి గురించి మాట్లాడుకొని నవ్వుకుంటాం. అంతే కానీ రమ్య కృష్ణతో నాకు ఎలాంటి విబేధాలు లేవు, అని కృష్ణ వంశీ చెప్పారు. 

click me!

Recommended Stories