గ్లామర్ హీరోయిన్ హేబా పటేల్ టాలీవుడ్ కు చాలా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘కుమారి 21ఎఫ్’తో తెలుగు ఆడియెన్స్ ను అలరించింది. ఈ మూవీతోనే హేబాకు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు దక్కింది.
26
తెలుగులో హేబా పటేల్ ‘అలా ఇలా’ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోక పోయినా.. రెండో చిత్రం ‘కుమారి 21ఎఫ్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందాల విందుతో కుర్రకారును తనవైపు తిప్పుకుంది.
36
‘కుమారి 21ఎఫ్’ మంచి విజయాన్ని సాధించడంతో హేబా పటేల్ కు తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం తమిళంలోనూ అవకాశాలు అందుకుంటోంది. చివరిగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటించిన ‘రెడ్’లో స్పెషల్ అపియరెన్స్ తో ఆకట్టుకుంది.
46
వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ ఇటు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా ఉంటోంది. తన వ్యక్తిగత విషయాలను నెటిజన్లు, ఫాలోవర్స్ తో పంచుకుంటూ మరింత దగ్గరవుతోంది. ఈ సందర్భంగా తాజాగా లేటెస్ట్ పిక్స్ ను పంచుకుంది.
56
ఈ పిక్స్ లో హేబా పటేల్ క్యూట్ లుక్స్ ను సొంతం చేసుకుంది. ఓ రెస్టారెంట్ కు వెళ్లి హేబా క్యాజువల్ గా ఫొటోలకు ఫోజులివ్వడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ పిక్స్ కు క్యూట్ అంటూ అభిమానులు, ఫాలోవర్స్ కామెంట్లు పెడుతున్నారు.
66
ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ‘తెలిసినవాళ్లే, గీతా, విలన్, ఓదెల రైల్వే స్టేషన్, ఆద్య’ వంటి తెలుగు, తమిళ భాష చిత్రాల్లో నటిస్తోంది. ఇందులో మూడు చిత్రాలు రిలీజ్ కు సిద్ధం కాగా.. మిగతా రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి.