కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి, శోభన్ బాబు గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కోదండరామిరెడ్డి సినిమాలు లేకుండా చిరంజీవి కెరీర్ ని ఊహించుకోవడం కష్టం.
తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాలు మెగాస్టార్ చిరంజీవి తిరుగులేని రారాజులా వెలుగొందారు. చిరంజీవి తన కెరీర్ లో ఎందరో దర్శకులతో పనిచేశారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ దర్శకుడిని, నిర్మాతని మెప్పిస్తూ మరిన్ని అవకాశాలు పొందారు. చిరంజీవి కెరీర్ లో కొందరు దర్శకులు అత్యంత కీలకంగా వ్యవహారించారు. వారిలో కోదండరామిరెడ్డి, రాఘవేంద్ర రావు పేర్లు ప్రధానంగా చెప్పుకోవాలి.
25
హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి..
కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు కోదండరామిరెడ్డి ఇండస్ట్రీకి వచ్చింది హీరో అవుదామని అట. తన స్నేహితులు, ఇండస్ట్రీలో ఉన్న వారు చాలా మంది తాను శోభన్ బాబులా ఉంటానని అనేవారట. అలాంటి కోదండరామిరెడ్డి చివరికి దర్శకుడిగా మారి శోభన్ బాబుతోనే సినిమాలు చేశారు.
35
దర్శకుడిగా మారిన తర్వాత ఆ ఆలోచన లేదు
వీరిద్దరి కాంబినేషన్ లో బావ మరదళ్ళు, ప్రేమ మూర్తులు లాంటి సినిమాలు వచ్చాయి. ఒకసారి దర్శకుడిగా అవకాశం వచ్చాక ఇక హీరో అవుదామనే ఆలోచనే లేదని కోదండరామిరెడ్డి అన్నారు. ఇండస్ట్రీకి వచ్చింది మాత్రం హీరో కావాలనే కోరికతోనే అని కోదండరామిరెడ్డి అన్నారు.
కోదండరామిరెడ్డి మాట్లాడుతూ.. ఒకసారి శోభన్ బాబుతో ఇలా సరదాగా అన్నాను. శోభన్ బాబుగారు.. నేను మీలా ఉంటానని అందరూ అంటున్నారు. కాబట్టి మీ ఆస్తిలో నాకు సగం కావాలి అని అడిగాను. ఆయనకు సరదాగా సమాధానం ఇచ్చారు. అలాగే తీసుకో రామిరెడ్డి.. కాకపోతే ఆస్తి మొత్తం పిల్లల పేరుపై రాసేశాను.. ఇప్పుడెలా అని చమత్కరించారు.
55
అలా జరిగుంటే చిరంజీవి కెరీర్ ని ఊహించుకోగలమా ?
ఒక వేళ నిజంగా కోదండ రామిరెడ్డి హీరో అయి ఉంటే.. చిరంజీవి కెరీర్ ఎలా ఉండేది అనే ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే చిరంజీవి కెరీర్ కి బలమైన పునాది వేసింది ఆయనే. వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు 23 చిత్రాలు వచ్చాయి. ఒకటి రెండు మినహా మిగిలిన అన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఖైదీ చిత్రం అయితే చిరంజీవిని తిరుగులేని స్థాయికి తీసుకువెళ్ళింది. చిరంజీవి అప్పట్లో రాత్రి 2 వరకు షూటింగ్ చేసి మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలకు సెట్ లో రెడీగా ఉండేవారని కోదండరామిరెడ్డి అన్నారు. కోదండ రామిరెడ్డి లేని చిరంజీవి కెరీర్ ని ఊహించుకోవడం కష్టం. పసివాడి ప్రాణం, ఖైదీ, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలు వీరి కాంబినేషన్ లోనే వచ్చాయి.