Degala Babji Review: బండ్ల గణేష్ 'డేగల బాబ్జీ' మూవీ రివ్యూ!

First Published May 20, 2022, 12:43 PM IST

కమెడియన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ ఆ తర్వాత సూపర్ హిట్ చిత్రాల నిర్మాతగా మారారు. ప్రత్యేకమైన శైలి, ముక్కుసూటితనం, అభిమానులని అలరించే ప్రసంగాలతో బండ్ల గణేష్ విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. 

కమెడియన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ ఆ తర్వాత సూపర్ హిట్ చిత్రాల నిర్మాతగా మారారు. ప్రత్యేకమైన శైలి, ముక్కుసూటితనం, అభిమానులని అలరించే ప్రసంగాలతో బండ్ల గణేష్ విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. బండ్ల గణేష్ మరోసారి నటుడిగా మారి ప్రయోగాల బాట పడుతున్నారు. బండ్ల గణేష్ నటించిన 'డేగల బాబ్జీ' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆ చిత్రం ఎలా ఉందొ రివ్యూలో తెలుసుకుందాం. 

కథ :

డేగల బాబ్జీ చిత్రం తమిళంలో విజయం సాధించిన ఒత్త సెరప్పు సైజు 7 అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. వెంకట్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సినిమా ఆరంభంలో ఓ మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ లో డేగల బాబ్జీ (బండ్ల గణేష్:) చెప్పిన విషయాలే ఈ చిత్ర కథ. మర్డర్ తానే చేశానని, మరికొన్ని మర్డర్స్ చేశానని కూడా ఒప్పుకుంటాడు. బాబ్జీ ఇన్వెస్టిగేషన్ లో అలా ఎందుకు చెప్పాడు అనేది ఈ చిత్ర కథలో ఉత్కంఠ భరితమైన అంశం. 

విశ్లేషణ :

ఈ చిత్రంలో బండ్ల గణేష్ మినహా మిగిలిన నటులు ఎవ్వరూ ఉండరు. ఈ చిత్రం బండ్ల గణేష్ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఇతర పాత్రలు ఉంటాయి కానీ అవి బ్యాక్ గ్రౌడ్ వాయిస్ రూపంలో వినిపిస్తూ ఉంటాయి. కనిపించవు. అలా వైవిధ్యంగా సింగిల్ క్యారెక్టర్ తో ప్రయత్నించిన చిత్రం ఇది. అలా తానొక్కడే సినిమా మొత్తాన్ని నడిపించాలంటే మామూలు విషయం కాదు. 

డేగల బాబ్జిగా బండ్ల గణేష్ నటన పర్వాలేదనిపించే విధంగా ఉంది. కొన్ని చోట్ల బండ్ల గణేష్ నటన సర్ ప్రైజ్ చేసే విధంగా ఉంటుంది. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ ని లైవ్ లో చూస్తున్న ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. తమిళంలో ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. 

కానీ తెలుగులో ఈ చిత్రానికి ఆస్థాయి ఆదరణ దక్కుతుందా అనేది పెద్ద ప్రశ్న. సింగిల్ క్యారెక్టర్ తో సినిమా చూడాలంటే చాలా మంది ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు. చాలా వరకు ఆ ఫీలింగ్ కలగకుండా బండ్ల గణేష్ నటనతో , సస్పెన్స్ ఎలిమెంట్స్ తో మెప్పించే ప్రయత్నం చేశారు. సినిమా మొత్తాన్ని బండ్ల గణేష్ బ్యాలెన్స్ చేస్తూ ఎండ్ వరకు తీసుకురాగలిగారు. 

టెక్నికల్ గా :

టెక్నికల్ గా ఈ చిత్రం ఒకే అనే చెప్పాలి. సౌండ్ ఎఫెక్ట్స్ పర్వాలేదనిపించే విధంగా ఉంటాయి. సినిమాలో 80 శాతం బండ్ల గణేష్ డైలాగులే వినిపిస్తాయి. కొన్ని చోట్ల ఆ డైలాగులు ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఈ చిత్రంలో ప్రధాన బలం అంటే బండ్ల గణేష్, కొన్ని సస్పెస్ మూమెంట్స్, అలాగే కొత్తగా ఉండే కాన్సెప్ట్. మిగిలిన అంశాలు బండ్ల గణేష్ ఫ్యాన్స్ కి కొత్తగా అనిపిస్తాయి కానీ.. జనరల్ ఆడియన్స్ బోర్ గా ఫీల్ అవుతారు. సింగిల్ క్యారెక్టర్ కనుక విసుగు కూడా పుట్టే అవకాశం ఉంది. సో ఈ చిత్రం చూడాలనుకునే వారు అంచనాలని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. 

ఫైనల్ థాట్ : ఖచ్చితంగా బండ్ల గణేష్ ని సిల్వర్ స్క్రీన్ పై చూడాలనుకునే వాళ్లకు మాత్రమే.. 

రేటింగ్ : 2.5/5

click me!