దర్శకుడు రోజూ తాగి సెట్‌కి వచ్చేవాడు, బాలకృష్ణ సినిమా డిజాస్టర్‌ కారణం అతనే

Published : Dec 09, 2024, 05:53 PM ISTUpdated : Dec 09, 2024, 06:17 PM IST

బాలకృష్ణ సినిమా పెద్ద డిజాస్టర్ కి కారణం దర్శకుడే. తాగి సెట్‌కి వచ్చేవాడు, పొగరుతో ఉండేవాడంటూ నిర్మాత అంబికా కృష్ణ ఆయనపై మండిపడ్డారు.   

PREV
15
దర్శకుడు రోజూ తాగి సెట్‌కి వచ్చేవాడు, బాలకృష్ణ సినిమా డిజాస్టర్‌ కారణం అతనే

బాలకృష్ణ కెరీర్‌లో అనేక హిట్లు ఉన్నాయి, అలాగే పరాజయాలున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం దారుణమైన డిజాస్టర్‌ అయ్యాయి. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాయి. అలాంటి చిత్రాల్లో `వీరభద్ర` ఒకటి. ఏఎస్‌ రవికుమార్‌ చౌదరీ దర్శకత్వం వహించిన ఈ మూవీని అంబికా కృష్ణ నిర్మించారు. తనుశ్రీ దత్తా, సదా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా దారుణమైన డిజాస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో దీనిపై నిర్మాత స్పందించారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

25

నిర్మాత అంబికా కృష్ణ తాజాగా ట్రీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్‌ విషయాలను పంచుకున్నారు. సినిమా పరాజయానికి కారణమేంటో తెలిపారు. దర్శకుడిని బండబూతులు తిట్టాడు. అప్పుడు కూడా పెద్ద గొడవ జరిగిందన్నారు. మరి ఇంతకి గొడవేంటి? అసలు ఏం జరిగింది? బాలకృష్ణ అన్నీ తెలిసి ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడనేది చూస్తే.
 

35

బాలకృష్ణ హీరోగా నటించిన `వీరభద్ర` సినిమా షూటింగ్‌ ఫారెన్‌లో జరుగుతుంది. ఓ రోజు షూటింగ్‌ అయ్యింది. నెక్ట్స్ డే హీరోయిన్‌ వచ్చి తాను ఇండియా వెళ్లిపోతా అని, మా నాన్నకి ఆరోగ్యం బాగా లేదని చెప్పి మొరాయించింది. ఆమెని కన్విన్స్ చేయడానికి సగం రోజు పోయింది.

వాళ్ల నాన్నతో మాట్లాడించి ఒప్పించాం. `వీరభద్ర` సినిమా పాడవడానికి ఒకటి నుంచి వంద శాతం దర్శకుడే కారణం. అతను పరమ దుర్మార్గుడు` అంటూ బూతులు తిట్టాడు నిర్మాత అంబికా కృష్ణ. ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టించి, ఇష్టం వచ్చినట్టు సినిమా తీశాడని ఆరోపించారు.
 

45

స్క్రిప్ట్ చెప్పింది ఒకటి, తీసింది ఒకటి. బడ్జెట్‌ అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ఒళ్లు పొగరుతో సినిమా తీశాడని మండిపడ్డాడు అంబికాకృష్ణ. బాలకృష్ణ లాంటి పెద్ద హీరో కాల్షీట్లు ఇచ్చాడటంటే ఎంత జాగ్రత్తగా సినిమాలు చేయాలి, ఎంత ఒళ్లు దగ్గరపెట్టుకుని సినిమా చేయాలి. కానీ తాగి షూటింగ్‌కి వచ్చేవాడు.

బాలకృష్ణ కూడా కేకలు వేసేవాడు. బాలకృష్ణ ఏంటంటే ఒకసారి కథని ఓకే చేశాక, దర్శకుడు ఏం చెబితే అది చేస్తాడు. అంత కమిటిడెడ్‌గా ఉంటారు. కానీ దర్శకుడే పరమ నీచుడు అని, ఆయనవల్లే సినిమా పోయిందన్నారు. ఈ విషయంలో దర్శకుడితో చాలా గొడవలు అయ్యాయని, బాగా అరవడం జరిగిందన్నారు. 
 

55

బాలయ్య బాబు కూడా కోప్పడ్డాడని, కానీ ఆయన ఎక్కువగా నిర్మాత గురించి ఆలోచిస్తారు. తాను ఏమైనా ఉంటే దర్శకుడు హ్యాండిస్తే నిర్మాత నష్టపోతాడని ఆలోచించి చాలా వరకు కంట్రోల్‌గా ఉండేవారని, కానీ ఈ దర్శకుడు మాత్రం పిచ్చి పిచ్చిగా సినిమా తీశాడని తెలిపారు. ఎడిటింగ్‌ చేస్తే మరో రెండు సినిమాల ఫూటేజ్‌ చెత్త కుప్పలోకి వెళ్లిందని, అంత ఎక్కువ ఫూటేజీ ఇష్టం వచ్చినట్టు తీశాడని వాపోయాడు నిర్మాత.

 ఈ మూవీ 2005లో విడుదలై పెద్ద డిజాస్టర్‌ అయిన విషయం తెలిసిందే. అయితే సినిమా పోవడంతో హీరో బాలకృష్ణ పిలిచి మళ్లీ సినిమా చేస్తానని చెప్పాడట. ఇప్పుడు ఆయనతో సినిమా చేయాలనుకుంటున్నాడట నిర్మాత అంబికా కృష్ణ. తాజాగా ఆయన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

read more: కంగువా vs పుష్ప 2: సూర్య సినిమాని తొక్కిన కోలీవుడ్‌, అల్లు అర్జున్‌ సినిమాకి బ్రహ్మరథం పట్టడానికి కారణమేంటి?

also read: వీణ స్టెప్పుని కూనీ చేశారు, ఈ ఒక్క పాయింట్ నా బ్రదర్ చిరంజీవికి అంటూ బాలయ్య క్రేజీ కామెంట్స్


 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories