చిరంజీవి గారికి పాలిటిక్స్ కరెక్ట్ కాదు..మాటకి మాట కత్తికి కత్తి చూపే మీ తమ్ముడు చూసుకుంటాడు: డైరెక్టర్ బాబీ

Published : Jan 08, 2023, 10:27 PM IST

వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా బిగ్గెస్ట్ ఈవెంట్ ప్రీ రిలీజ్ వేడుకని చిత్ర యూనిట్ నేడు వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహిస్తోంది. మెగాస్టార్, రవితేజ అభిమానులతో ఏయూ గ్రౌండ్స్ నిండిపోయింది.

PREV
17
చిరంజీవి గారికి పాలిటిక్స్ కరెక్ట్ కాదు..మాటకి మాట కత్తికి కత్తి చూపే మీ తమ్ముడు చూసుకుంటాడు: డైరెక్టర్ బాబీ

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దర్శకుడు బాబీ.. వింటేజ్ మెగాస్టార్ ని సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆచార్య చిత్రం డిజాస్టర్ కావడం, గాడ్ ఫాదర్ మూవీ రీమేక్ కావడంతో మెగా ఫ్యాన్స్ వాల్తేరు వీరయ్య కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

27

వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా బిగ్గెస్ట్ ఈవెంట్ ప్రీ రిలీజ్ వేడుకని చిత్ర యూనిట్ నేడు వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహిస్తోంది. మెగాస్టార్, రవితేజ అభిమానులతో ఏయూ గ్రౌండ్స్ నిండిపోయింది. ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు డైరెక్టర్ బాబీ సంచలన ప్రసంగం చేసారు. మరణించిన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ దర్శకుడు బాబీ ఎమోషనల్ అయ్యారు. సినిమా గురించి మాత్రమే కాకుండా చిరంజీవి రాజకీయాల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

37

మా నాన్న గారి వల్లే నాకు చిరంజీవి గారిపై పిచ్చి అభిమానం ఏర్పడింది అని బాబీ అన్నారు. ఆ పిచ్చి అభిమానంతో ఈ చిత్రాన్ని ప్రేమ్ టు ఫ్రేమ్ అద్భుతంగా తీశా అని బాబీ అన్నారు. చిరంజీవిని ప్రశంసలతో ముంచెత్తుతూ బాబీ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. చిరంజీవి లాంటి తండ్రి, కొడుకు, భర్త ప్రతి ఫ్యామిలిలో ఉండాలి అని బాబీ అన్నారు. 

47

గుంటూరులో ఇంద్ర ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఎక్కడో నేను మా నాన్న ఎర్రమట్టిలో కూర్చుని ఉన్నాం. ఆ రోజు నేను మా నాన్నకి మాట ఇచ్చా. చిరంజీవితో తప్పకుండా సినిమా చేస్తానని చెప్పా. ఇప్పుడు మా నాన్న ఇక్కడ లేకపోవచ్చు.. పైనుంచి చూస్తూనే ఉన్నారు. వాల్తేరు వీరయ్య షూటింగ్ జరుగుతున్నప్పుడు మా నాన్నకి క్రిటికల్ గా ఉంది. అప్పుడు కూడా ఆయన నేను షూటింగ్ చేయాలనే కోరుకున్నారు. అలాంటి కరుడుకట్టిన చిరంజీవి అభిమాని ఆయన. 

57

చిరంజీవి గారి గురించి ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు. కానీ ఆయన తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడరు. అంత మంచితనం ఏంటి.. ఎలా సాధ్యం అని అనుకునేవాడిని. దానికి ఒకరోజు ఆయన సమాధానం చెప్పారు. వాళ్ళకి కూడా ఫ్యామిలీలు ఉంటాయి. మనం తిడితే బాధపడతారు అని అన్నారు. 

67

ఇక చిరంజీవి రాజకీయాల గురించి టచ్ చేస్తూ బాబీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నయ్య మీరు రాజకీయాలకు 1 పర్సెంట్ కూడా కరెక్ట్ కాదు.  మీకు దేవుడు ఒక తమ్ముడిని ఇచ్చారు.. పవర్ స్టార్.. ఆయన చూసుకుంటారు. మాటకు మాట కత్తికి కత్తి చూపిస్తారు అని బాబీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కామెంట్స్ చేశారు. ఇద్దరిలో అదే మంచితనం చూశా. ఆయనతో మీకంటే ముందే సినిమా చేశా అని బాబీ తెలిపారు. 

77

సినిమా గురించి మాట్లాడుతూ ఇంటర్వెల్ గురించి ఆసక్తికర విషయం లీక్ చేశాడు. పదినిమిషాల పాటు మెగాస్టార్ అరాచకం చూస్తారు.. అప్పుడు పూనకాలు లోడింగ్ అంటూ ఇంటర్వెల్ పడుతుంది అని బాబీ రివీల్ చేశారు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరిని ప్రశంసించారు. 

Read more Photos on
click me!

Recommended Stories