Waltair Veerayya Event: మెగా అభిమానులతో పోటెత్తిన విశాఖ.. రెండు సముద్రాలను తలపిస్తున్న వైజాగ్‌.. ఫోటోలు వైరల్‌

Published : Jan 08, 2023, 07:44 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన `వాల్తేర్‌ వీరయ్య` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఈ సాయంత్రం విశాఖలో జరుగుతుంది. ఈ ఈవెంట్‌కి భారీ స్థాయిలో మెగా అభిమానులు కదిలి రావడం విశేషం. దీంతో వైజాగ్‌ ఇప్పుడు పోటెత్తిపోయింది. 

PREV
18
Waltair Veerayya Event: మెగా అభిమానులతో పోటెత్తిన విశాఖ.. రెండు సముద్రాలను తలపిస్తున్న వైజాగ్‌.. ఫోటోలు వైరల్‌

చిరంజీవి, రవితేజ కలిసి నటించిన `వాల్తేర్‌ వీరయ్య` చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం వైజాగ్‌లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ని నిర్వహించారు. విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈవెంట్‌ ప్రారంభమైంది. 
 

28

మెగాస్టార్‌ చిరంజీవి, మాస్‌ మహారాజా రవితేజ, దర్శకుడు బాబీతోపాటు నిర్మాతలు, ఇతర చిత్ర బృందం ప్రత్యేక జెట్‌ ఫ్లైట్‌లో వైజాగ్‌కి చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి స్పెషల్‌ ఫ్లైట్‌లో `వాల్తేర్‌ వీరయ్య` టీమ్‌ వైజాగ్‌లోని ఈవెంట్ కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతుంది. 

38

మరోవైపు ఏయూ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న `వాల్తేర్‌ వీరయ్య` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి భారీగా మెగా అభిమానులు కదిలి వచ్చారు. భారీ స్థాయిలో ఈవెంట్‌ ప్రాంగణం ఏర్పాటు చేయగా, వేదిక మొత్తం మెగా అభిమానులతో, మాస్‌ మహారాజా రవితేజ అభిమానులతో నిండిపోయింది. 

48

మెగా అభిమానులతో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ పోటెత్తిపోయింది. ఓ వైపు సముద్రం, మరోవైపు మెగా అభిమానులతో వైజాగ్‌కి రెండు సముద్రాలున్న ఫీలింగ్‌ని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఈవెంట్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దాదాపు ప్రాంగణం మొత్తం నిండిపోవడం విశేషం. 
 

58

అయితే `వాల్తేర్‌ వీరయ్య` ప్రీ రిలీజ్‌ ఈవెంట్ విషయంలో పెద్ద హైడ్రామా కొనసాగిన విషయం తెలిసిందే. మొదట వైజాగ్‌ ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేయాలని చిత్ర బృందం ప్లాన్‌ చేసింది. ఏర్పాట్లు కూడా ప్రారంభించింది. కానీ పోలీసులు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం నుంచి పర్మిషన్‌ లేకపోవడంతో వారు అభ్యంతరం తెలిపారు. 
 

68

ఆదివారం కావడంతో సాధారణ ప్రజలు బీచ్‌లో భారీగా వస్తారు, దీనికితోడై ఈవెంట్కి మెగా అభిమానులు సైతం భారీ గా వస్తారు. దీంతో ట్రాఫిక్‌ ఇబ్బందులతోపాటు, సాధారణ ప్రజలు కూడా ఇబ్బంది పడతారని, పరిస్థితి అదుపులో ఉండనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పర్మిషన్‌ ఇవ్వలేదని తెలుస్తుంది. దీంతో చివరి నిమిషంలో ఏయూ కాలేజ్‌ గ్రౌండ్‌కి మర్చారు. ఇక ఈవెంట్‌ ప్రారంభమైంది. చిత్ర బృందం ఒక్కొక్కరుగా ఈవెంట్ కి చేరుకుంటున్నారు. ఇందులో చిరంజీవి ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
 

78

ఇక సింగర్స్ పాటలు, అభిమానుల కోలాహలం, అరుపులు, కేకలతో ప్రాంగణం మొత్తం హోరెత్తిపోయింది. ముఖ్యంగా చిరంజీవి పాటలకు అభిమానులు డాన్సులు చేయడం విశేషం. దీనికితోడు వేదికపై డాన్సర్లు డాన్సులు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. 

88

చిరంజీవి, రవితేజ హీరోలుగా, శృతి హాసన్‌, కేథరిన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. మెగా ఫ్యాన్స్ ని అలరించాయి. ఇక శనివారం రిలీజ్‌ అయిన ట్రైలర్‌ సైతం దుమ్మురేపుతుంది. మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉండటం విశేషం. దీంతో సినిమా కోసం అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం రిలీజ్‌ కాబోతున్న విషయం తెలిసిందే. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories