Director Bobby Love Story : వరుస సూపర్ హిట్ చిత్రాలతో డైరెక్టర్ బాబీ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. వివాదాల జోలికి పోకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుని వెళ్లడం బాబీ స్టైల్. డైరెక్టర్ బాబీ అసలు పేరు కొల్లి సంతోష్ రవీంద్ర.
Director Bobby Wife and their love story : వరుస సూపర్ హిట్ చిత్రాలతో డైరెక్టర్ బాబీ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. వివాదాల జోలికి పోకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుని వెళ్లడం బాబీ స్టైల్. డైరెక్టర్ బాబీ అసలు పేరు కొల్లి సంతోష్ రవీంద్ర. బాబీ అసిస్టెంట్ రైటర్, ఘోస్ట్ రైటర్ గా కెరీర్ ప్రారంభించారు. ఇప్పుడు కమర్షియల్ చిత్రాలకు తిరుగులేని దర్శకుడిగా ఎదిగారు.
25
పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ, వెంకీ మామ, వాల్తేరు వీరయ్య లాంటి చిత్రాలు తెరకెక్కించిన బాబీ రీసెంట్ గా బాలయ్యతో డాకు మహారాజ్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టారు. బాబీ ఇంత వరకు ప్రేమ కథా చిత్రాలు తెరకెక్కించలేదు. కానీ బాబీ రియల్ లైఫ్ లో మాత్రం ఎమోషనల్ లైవ్ స్టోరీ ఉంది. డైరెక్టర్ బాబీ ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రముఖ చెస్ ఛాంపియన్ హారిక సోదరి అనూషని. వాళ్ళది పెద్ద ఫ్యామిలీ.. బాగా ధనిక కుటుంబం.
35
Director Bobby love story
కానీ ఆమె బాబీకి ఎలాంటి గుర్తింపు లేని సమయంలోనే అతడిని ప్రేమించింది. బాబీ తన లవ్ స్టోరీ గురించి ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేస్తూ.. నేను అదృష్టంగా ఫీల్ అయ్యేది నా భార్య గురించి అని తెలిపారు. నేను స్కూల్ డేస్ నుంచే ఆమెని ప్రేమించడం మొదలు పెట్టాను. ఆ టైం లో అది ఆకర్షణో ప్రేమో తెలియదు. వాటర్ బాటిల్ షేర్ చేసుకోవడంతో మా పరిచయం మొదలైంది.
45
ఆమె ఇంజినీరింగ్ లో, ఎంటెక్ లో రెండింటిలో గోల్డ్ మెడలిస్ట్. పైగా పెద్ద ఫ్యామిలీ. నాకు ఎలాంటి గుర్తింపు లేదు. అయినప్పటికి అనూషతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా నన్ను నమ్మారు. నేను సక్సెస్ అవుతానని భావించారు. అనూషని పెళ్లి చేసుకునే సమయానికి కనీసం రెంట్ కూడా కట్టే స్థితిలో నేను లేను అని తెలిపారు.
55
అనూష సోదరి హారిక మాకు సహాయం చేయాలి అనుకున్నారు. కానీ మేము మా కష్టాలు మేం పడాలి అనుకున్నాం అంటూ బాబీ చెప్పుకొచ్చారు. రైటర్ గా గుర్తింపు వచ్చాక పవర్ చిత్రంతో తొలిసారి దర్శకత్వం చేసే ఛాన్స్ వచ్చింది. అక్కడి నుంచి బాబీ వెనుదిరిగి చూసుకోలేదు.