మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ విజయదశమి కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ మొదలు కావడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ విజయదశమి కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ మొదలు కావడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రతి రోజు సాలిడ్ కలెక్షన్స్ తో గాడ్ ఫాదర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. శనివారం రోజు ఈ చిత్ర సక్సెస్ సెలెబ్రేషన్స్ జరిగాయి.
26
ఈ సెలెబ్రేషన్స్ కి చిరంజీవి తర్వాతి చిత్ర దర్శకుడు బాబీ కూడా హాజరయ్యారు. బాబీ మాట్లాడుతూ పొరపాటుగా మెగా 154 మూవీలో ఇంటర్వెల్ బ్లాక్ గురించి షాకింగ్ మ్యాటర్ లీక్ చేశారు. గాడ్ ఫాదర్ ఇంటర్వెల్ చిరంజీవి గారికి ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఆయన కళ్ళని వాడుకుని సెటిల్డ్ గా చూపిస్తూ గూస్ బంప్స్ తెప్పించారు.
36
ఆ సన్నివేశాన్ని మోహన్ రాజా అద్భుతంగా తెరకెక్కించారు. ఒక డైరెక్టర్ గా నాకు ఒక కుళ్ళు, ఈర్ష కలిగాయి అని అన్నారు. పక్కనే ఉన్న సుమ మీకెందుకు కుళ్ళు చిరంజీవి నెక్స్ట్ మూవీ మీదేకదా అని అన్నారు. కానీ నా సినిమాలో ఇంటర్వెల్ ఇలా ఉండదు.
46
ఒక జాతర, కోలాహలం చూసినట్లు ఉంటుంది అని అన్నారు. బాబీ కామెంట్స్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఈ సంక్రాంతికి పూనకాలు లోడింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
56
మెగా 154లో మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్. ఈ చిత్రంలో చిరంజీవి మత్స్యకార యూనియన్ లీడర్ గా కనిపిస్తారని అంటున్నారు. అలాగే రవితేజ పోలీస్ పాత్రలో నటించబోతున్నట్లు లీకులు వస్తున్నాయి.
66
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి చేయబోతున్న తొలి స్టైట్ మాస్ మూవీ ఇదే.