దీంతో, గరికపాటి ప్రసంగానికి అంతరాయం కలిగింది. ఈ క్రమంలో... చిరంజీవి ఫొటో సెషన్ ఆపకపోతే తాను వెళ్లిపోతానని గరికపాటి అన్నారు. వెంటనే చిరంజీవి సెల్ఫీలు దిగడం ఆపేసి వచ్చారు. కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి ఇద్దరూ బాగానే మాట్లాడుకున్నారు. అయితే, చిరంజీవి సోదరుడు నాగబాబు చేసిన ట్వీట్లు వివాదాన్ని రాజేశాయి. ఏపాటి వాడైనా చిరంజీవి ఇమేజ్ ను చూస్తూ ఆ పాటి అసూయపడటం పరిపాటేనని నాగబాబు అన్నారు.